Cm revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జరుగుతున్న వివాదంపై స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని అనవసరంగా వివాదం రేపుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో వేర్వేరు తరాలు, వేర్వేరు ఆలోచనా విధానాలు సహజమని చెప్పాలన్న ఉద్దేశ్యంతోనే ఆ వ్యాఖ్యలు చేసినట్టు రేవంత్ స్పష్టం చేశారు.
డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా, పార్టీ నిర్మాణంలో పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పేందుకు చేసిన ప్రయత్నాన్ని రాజకీయంగా వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలకు ఏ ఇతరార్థం లేనప్పటికీ, వాటిని విస్తరించి తప్పుగా ప్రస్తావించడం సరైంది కాదని తెలిపారు.
రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ, తెలంగాణలో వరుసగా రెండు టర్మ్‌లు తనదే ముఖ్యమంత్రి పదవిగా ఉంటుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసమే తన బలం అని, అభివృద్ధి–పాలనతో ఆ నమ్మకాన్ని మరింత బలపరుస్తామని చెప్పారు.

