Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాత్రి లండన్‌కు వెళ్లనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు ఆయన బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో పలు పెట్టుబడిదారులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. విదేశీ పెట్టుబడులపై, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పర్యటన అనంతరం చంద్రబాబు వచ్చే వారం భారత్ తిరిగి రానున్నా.ఈ క్రమంలో విశాఖపట్నంలో నవంబరులో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. లండన్‌లో రోడ్డు షోతో పాటు సీఐఐ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. లండన్ నుంచి మళ్లీ తిరిగి నవంబర్ 6వ తేదీన అమరావతికి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
							
