Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 157వ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు అధికారిక టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుగుతోంది.
తాజాగా, ఈ సినిమాకు “మన శంకరవరప్రసాద్” అనే పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది చిరంజీవి అసలు పేరు కావడం విశేషం. దీంతో అభిమానుల్లో ఈ టైటిల్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
షూటింగ్ వేగంగా కొనసాగుతుంది
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో, చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. మరో ప్రముఖ నటి కేథరిన్ థెరిస్సా కీలక పాత్రలో కనిపించనుంది. ఇక విక్టరీ వెంకటేష్ కూడా గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan OG Movie: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’.. అనుకున్న టైం కే థియేటర్ లోకి సినిమా
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి మాట్లాడుతూ— ఇందులో 70% కామెడీ, 30% భావోద్వేగాల మేళవింపుతో వినోదాత్మకంగా ఉండబోతుందని చెప్పారు.
#Megaanil title మన శంకరవరప్రసాద్ గారు
— NaaNI (@cultfan07) July 11, 2025
డబుల్ రోల్‌లో చిరంజీవి!
ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్ చేస్తున్నట్టు కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఒక పాత్రలో ఆయన స్కూల్ డ్రిల్ మాస్టర్ ‘శివ శంకర వరప్రసాద్’గా కనిపించనున్నారు అని ఫిలింనగర్ టాక్. చిరంజీవి కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో అలరించనున్నారని చిత్రబృందం భావిస్తోంది.
ఆఖరికి…
“మన శంకరవరప్రసాద్” అనే టైటిల్‌పై అభిమానుల్లో మంచి ఆసక్తి ఉన్నప్పటికీ, చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
#MegaAnil మనశంకరవరప్రసాద్ గారు
త్వరలో కొచ్చి వెళ్లి సాంగ్ షూట్
చేయ బోతున్నారు
— devipriya (@sairaaj44) July 11, 2025