CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ తన నామినేషన్ను బుధవారం వేయనున్నారు. ఆ కార్యక్రమంలో హాజరయ్యేందుకు రేవంత్రెడ్డి ముందురోజే కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు.

