Chennai:రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు (మార్చి 22) చెన్నైలో జరిగే సమావేశంలో ఒకే వేదికను పంచుకోనున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సారధ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో వారిద్దరూ పాల్గొనేందుకు నిన్ననే వెళ్లారు. ఈ సదస్సునకు దక్షిణాది రాష్ట్రాల్లోని ఇండియా కూటమి పార్టీలతో పాటు బీఆర్ఎస్, వైసీపీ లాంటి పార్టీలను కూడా స్టాలిన్ ఆహ్వానించారు. ఆ మేరకు వారిద్దరూ ఈ సమావేశంలో జరిగే చర్చల్లో మాట్లాడనున్నారు.
Chennai:రాజకీయ చర్చల్లో ఉప్పు, నిప్పుగా ఉండే రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఒకే వేదికను పంచుకోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి చెన్నై బయలుదేరి వెళ్లగా, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ నిన్ననే వెళ్లారు. డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నదని ఇటు రేవంత్‌రెడ్డి, అటు కేటీఆర్ కేంద్రంపై విమర్శలను ఎక్కుపెట్టడం గమనార్హం. ఈ దశలో చెన్నైలో తీసుకునే నిర్ణయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరులు ఎలా ఉంటాయనే అంశంపైనా ఉత్కంఠ నెలకొన్నది.
Chennai:జనాభా నియంత్రణను కచ్చితంగా పాటిస్తూ, దేశ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్న దమ రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనే పాచిక ద్వారా కేంద్రంలోనీ బీజేపీ దుష్టపన్నాగం పన్నుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నది.
Chennai:శనివారం (మార్చి 22) చెన్నైలోని గిండిలో ఉన్న ఐటీసీ కాకతీయ చోళ హోటల్‌లో డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల సదస్సు జరుగుతుంది. ఈ సమావేశంలో తమిళనాడు, పంజాబ్, కేరళ, తెలంగాణ ముఖ్యమంత్రులైన స్టాలిన్, భగవంత్ మాన్, పినరయి విజయన్, రేవంత్‌రెడ్డి పాల్గొంటున్నారు. అనంతర భవిష్యత్తు కార్యాచరణలో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడి పోరాట పంథాపై రాజకీయ వర్గాల్లో అనుమానం ఉన్నది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.