Chennai: ఎన్నూర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో విషాదం

Chennai: చెన్నై సమీపంలోని ఎన్నూర్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. థర్మల్ పవర్ స్టేషన్‌లో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కట్టడం ఒక్కసారిగా కూలిపోవడంతో అనేకమంది కూలీలు పైభాగం నుంచి కిందపడిపోయారు. ఈ ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పదిహేనుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలంలో అల్లకల్లోలం పరిస్థితులు నెలకొన్నాయి. సహచరులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రక్షణ సిబ్బంది సహాయంతో మిగిలిన కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి గల నిజమైన కారణాలను వెలికితీసేందుకు ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కూలీల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు, కార్మిక సంఘాలు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *