Chandrababu

Chandrababu: మరో మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. వచ్చే ఎలక్షన్ లో గెలిచేది మోదీనే

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తుపై తన విజన్ ప్రకటించారు. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన 72 దేశాల ప్రతినిధులను, సుమారు 2,500 మంది పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం, రాష్ట్రాన్ని పెట్టుబడులకు, సాంకేతికతకు కేంద్రంగా మార్చేందుకు ఉన్న లక్ష్యాలను వివరించారు.

దేశంలోనే సురక్షితమైన నగరంగా విశాఖ

సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నగరాన్ని కొనియాడారు. “విశాఖ దేశంలోనే అందమైన నగరం అన్నారు. సురక్షితమైన నగరంగా కేంద్రం ఇటీవల ప్రకటించింది అని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డైనమిక్, సృజనాత్మకత కలిగిన నాయకుడు” అని ప్రశంసించారు.

2047లో భారత్ నంబర్‌ వన్: మోదీపై విశ్వాసం

దేశ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. “ప్రజలను, వనరులను, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటే తిరుగులేదు. 2047లోగా మనదేశం నెంబర్‌వన్ ఎకానమీ అవుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వం గెలుస్తుంది. దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారు” అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Bihar Election Result: బీహార్‌లో ఎన్డీఏ ప్రభంజనం.. 50 శాతం దాటుతున్న NDA ఓట్‌ షేర్‌

పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడిదారుల లక్ష్యంగా మారుస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రం నుంచి పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.రాబోయే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు ట్రిలియన్ డాలర్ల (దాదాపు $1 ట్రిలియన్) పెట్టుబడులు రావాలనేది తమ లక్ష్యమని ప్రకటించారు.

మరో మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ తక్షణ లక్ష్యమని తెలిపారు.”మేం వచ్చాక వ్యాపారం చేసేవారిని అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే 27 పాలసీలు తెచ్చాం. పెట్టుబడిదారులకు ఎస్క్రో అకౌంట్ ఇస్తాం” అని హామీ ఇచ్చారు.

టెక్నాలజీకి గేట్‌వేగా ఏపీ: స్పేస్ సిటీలు

సాంకేతికత, సుస్థిర అభివృద్ధి రంగాలలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం వివరించారు. ఏపీకి త్వరలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ వస్తున్నాయి. అలాగే క్వాంటమ్ వ్యాలీ మరియు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు కానున్నాయి.సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగం మరియు స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందున్నారని చెబుతూ, తెలుగు వారి ప్రతిభను కొనియాడారు.సాంకేతికత వేగాన్ని ప్రస్తావిస్తూ.. “మరో రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.రాష్ట్రాభివృద్ధిలో పర్యాటక రంగానిది కీలకపాత్ర అని చెబుతూ, అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని, సదస్సులో పాల్గొన్నవారంతా తప్పనిసరిగా ఆక్వాఫుడ్‌ను రుచి చూడాలని ఆహ్వానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *