Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు (మార్చి 5) ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అదే రోజు రాత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి బయల్దేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. మార్చి 6న ఉదయం ఆయన తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు 700 కిలోమీటర్ల యువతి సైకిల్ జర్నీ.. ఎందుకంటే..
ఆ తరువాత మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి ఢిల్లీలోనే బసచేసి, మార్చి 7న అమరావతికి తిరిగి రానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.