Air Passengers: విమాన ప్రయాణాల్లో ఇంటర్నెట్ సేవల వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు గైడ్ లైన్స్ ఇచ్చింది. విమాన ప్రయాణ సమయంలో ప్రయాణికులు 3 వేల మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాతే వై-ఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న విమానాల్లో మాత్రమే ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని అనుమతిస్తామని పేర్కొంది. ఫ్లైట్ అండ్ సీ కనెక్టివిటీ రూల్స్, 2018 ప్రకారం ప్రభుత్వం ఈ సూచనలను ఇచ్చింది. ఇందులో భారత గగనతలంలో విమానం 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాతే మొబైల్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు అనుమతి ఇస్తారు.
భూసంబంధమైన మొబైల్ నెట్‌వర్క్‌లతో జోక్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఇటువంటి సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోటిఫై చేసిన కొత్త రూల్స్‌తో ఆదేశాలు జారీ చేసింది. దీనితో, ఇప్పుడు కొత్తగా నోటిఫై చేయబడిన రూల్ ఫ్లైట్ అండ్ మారిటైమ్ కనెక్టివిటీ సవరణ రూల్స్, 2024గా పేర్కొన్నారు.

