Mr Idiot

Mr Idiot: ‘కావాలయ్యా’ అంటున్న రవితేజ వారసుడు!?

Mr Idiot: రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. జెజెఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై యలమంచిలి రాణి సమర్పణలో జెజె ఆర్ రవిచంద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌరి రౌణంకి దర్శకత్వం వహిస్తున్నారు. సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ‘కావాలయ్యా…’ లిరికల్ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ రిలీజ్ చేశారు. పాట, దాని చిత్రీకరణ బాగున్నాయన్నారు థమన్. ఇక ఈ పాటకు బాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఈ పాటను గాయని మంగ్లీ పాడటం విశేషం. ఈ పాటలో ‘కళ్లల్లోకి కళ్లు పెట్టి అదోలా చూశావయ్యా… మాటల్తోనే మనసుకు మందే పెట్టావయ్యా… తస్సాదియ్యా, తస్సాదియ్యా… పచ్చి పచ్చిగ చెప్పాలంటే పిచ్చిగ ఫిదా అయ్యా… పూవుల్తోటి పొట్లం గట్టి మేరె దిల్ దియా… చూస్కోవయ్యా, తీస్కోవయ్యా, కావాలయ్యా, నువ్వే కావాలయ్యా…’ అనే లైన్స్ కుర్రకారుకు కిర్రెక్కించేలా ఉన్నాయి. మరి ఈ పాట రవితేజ వారసుడి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుందేమో చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandini Chowdary : అలాంటి భర్తే కావాలంటున్న చాందిని చౌదరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *