Chandrababu

Chandrababu: సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా.. తప్పు చేస్తే ఎంతటివారైనా వదిలేది లేదు

Chandrababu: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసులో బాధితుడి తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరగా, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

మరింత Chandrababu: సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా.. తప్పు చేస్తే ఎంతటివారైనా వదిలేది లేదు
Dreams

Dreams: కలలో గాల్లో ఎగురుతున్నట్లు లేదా పైనుంచి కింద పడుతున్నట్లు అనిపిస్తుందా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా..?

Dreams: కలలో గాల్లో ఎగరడం లేదా విమాన ప్రయాణం చేయడం శుభప్రదం; ఇది కెరీర్, వ్యాపారంలో విజయానికి సంకేతం. కానీ ఎత్తైన ప్రదేశం నుండి కింద పడిపోతున్నట్లు కల వస్తే, అది పనుల్లో ఎదురయ్యే అడ్డంకులను సూచిస్తుంది కాబట్టి హెచ్చరికగా భావించాలి.

మరింత Dreams: కలలో గాల్లో ఎగురుతున్నట్లు లేదా పైనుంచి కింద పడుతున్నట్లు అనిపిస్తుందా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా..?
Pawan Kalyan

Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మణికొండలో నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఈ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. ఏ పార్టీ కలిసి రాకపోయినా ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని పవన్ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆయన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు.. సోమవారం హాజరుకావాలని ఆదేశం!

Allu Arjun: పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఏ11 నిందితుడిగా చేర్చగా, ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పోలీసులు మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.

మరింత Allu Arjun: అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు.. సోమవారం హాజరుకావాలని ఆదేశం!
Raaka

Raaka: రాజమౌళి ‘వారణాసి’కే తప్పని తిప్పలు.. అల్లు అర్జున్ ‘రాకా’ ఆశలపై నీళ్లు?

Raaka: రాజమౌళి-మహేష్ బాబుల ‘వారణాసి’ చిత్రానికి మేకర్స్ ఆశిస్తున్న భారీ ధరల వద్ద ఓటీటీ డీల్ క్లోజ్ కావడం లేదని గ్రేట్ ఆంధ్రా నివేదించింది. ఓటీటీ సంస్థలు కేవలం స్టార్ పవర్ కాకుండా పెట్టిన పెట్టుబడిపై రాబడి (ROI) ని లెక్కేస్తుండటమే దీనికి కారణం. ఈ మార్పు వల్ల అల్లు అర్జున్-అట్లీల ‘రాకా’ చిత్రం ఆశిస్తున్న రూ. 300-400 కోట్ల ఓటీటీ బిజినెస్‌కు కూడా బ్రేకులు పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత Raaka: రాజమౌళి ‘వారణాసి’కే తప్పని తిప్పలు.. అల్లు అర్జున్ ‘రాకా’ ఆశలపై నీళ్లు?
Viral News

Viral News: స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. రూ.20 నోటుపై వింత వినతి.. !

Viral News: దేవుడిని అందరూ వింత వింత కోరికలు అడుగుతుంటారు. తాము కోరుకున్న కోరికలు తీరాలని పేపర్ పైన రాసి కొంతమంది ముడుపులు కడితే, మరికొందరు హుండీలో వేస్తుంటారు. కొన్నిసార్లు భక్తులు కోరే కొన్ని వింతైన కోరికలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చాలాసార్లే చూశాం.

మరింత Viral News: స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. రూ.20 నోటుపై వింత వినతి.. !
Blodd Donation

Blodd Donation: రక్తదానం చేసిన 24గంటలో ని బాడీ లో ఎంజారుతుందో తెలుసా..?

Blodd Donation: రక్తదానం పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ. రక్తం ఇచ్చిన 24 నుండి 48 గంటల్లోనే శరీరంలోని ద్రవాలు మరియు లింఫాటిక్ వ్యవస్థ ద్వారా ప్లాస్మా భాగం తిరిగి భర్తీ అవుతుంది. ఎముక మజ్జ (Bone Marrow) ద్వారా కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కొన్ని వారాల్లో పూర్తవుతుంది. తాత్కాలికంగా రక్తపోటు తగ్గడం వల్ల వచ్చే తలతిరుగుడును తగినంత నీరు తాగడం, ఐరన్ మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా సులభంగా నివారించవచ్చు.

మరింత Blodd Donation: రక్తదానం చేసిన 24గంటలో ని బాడీ లో ఎంజారుతుందో తెలుసా..?
Nara Lokesh

Nara Lokesh: కోల్‌కతాలో ఇమామీ, శ్రీ సిమెంట్స్, వీసా స్టీల్ అధినేతలతో మంత్రి నారా లోకేష్ భేటీ!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కీలక పారిశ్రామిక, తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ కోల్‌కతాలో వీసా స్టీల్ ఎండీ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య అగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ సంస్కరణలను ప్రశంసించిన లోకేష్, ఏపీలోని విస్తారమైన తీరప్రాంతం, పోర్టులు, భూమి లభ్యత వంటి అనుకూల అంశాలను వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రభుత్వ చొరవలను పారిశ్రామికవేత్తలు అభినందించారు.

మరింత Nara Lokesh: కోల్‌కతాలో ఇమామీ, శ్రీ సిమెంట్స్, వీసా స్టీల్ అధినేతలతో మంత్రి నారా లోకేష్ భేటీ!
AP SSC Supplementary Results: 

AP SSC Supplementary Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈసారి 6.25% పెరిగిన పాస్ పర్సంటేజ్..

AP SSC Supplementary Results: ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వీటిని ప్రకటించారు. ఈసారి మొత్తం 94,990 మందిలో 78,261 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్ 6.25% పెరిగింది. ప్రభుత్వ ’20 రోజుల యాక్షన్ ప్లాన్’ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లేదా 95523 00009 నంబర్ ద్వారా వాట్సాప్‌లోనే తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.

మరింత AP SSC Supplementary Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈసారి 6.25% పెరిగిన పాస్ పర్సంటేజ్..
Delhi High Court

Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

Delhi High Court: టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ తేజస్ కారియా స్పష్టం చేశారు. ఉగ్రవాదం, సైబర్ నేరాలకు టెలిగ్రామ్ డార్క్ వెబ్‌లా మారుతోందన్న కేంద్రం వాదనతో కోర్టు ఏకీభవించింది.

మరింత Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు