Crime News

Crime News: పేరుకే లాయర్.. కూతురిని చంపిన కసాయి తల్లి

Crime News: ప్రియుడు మోహన్‌తో కలిసి జీవించడానికి అడ్డుగా ఉందని ఐదేళ్ల కూతురు వెన్నెలను హత్య చేసిన తల్లి, లాయర్ ప్రియాంకను కాడుగోడి పోలీసులు హాసనలో అరెస్ట్ చేశారు. కోటీశ్వరుడినని నమ్మించిన మోహన్ కోసం ప్రియాంక భర్తను వదిలేసి వచ్చింది. పాప అనారోగ్యంతో చనిపోయిందని అంత్యక్రియలు పూర్తి చేసినా, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై భర్తకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో హత్య ఉదంతం వెలుగుచూసింది. తీరా చూస్తే ప్రియుడు కోటీశ్వరుడు కాదు, కేవలం అద్దె ఇళ్ల బ్రోకర్ అని తేలింది.

మరింత Crime News: పేరుకే లాయర్.. కూతురిని చంపిన కసాయి తల్లి
Crime News

Crime News: సినిమాని మించిన ప్లాన్.. భార్య హత్యకు సుపారీ ఇచ్చిన భర్త.. కేసు ఛేదించిన కూరగాయల సంచి!

Crime News: ఐడీఏ బొల్లారంలో జరిగిన మీనాదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్త అనిల్ కుమార్ భార్యను వదిలించుకోవడానికి బీహార్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి చంపించాడు. బండి పాడైందని, గుర్తుతెలియని వ్యక్తులు భార్యను లాకెళ్లి చంపారని భర్త నాటకమాడాడు. అయితే ఘటన స్థలంలో కూరగాయల సంచి కింద పడకుండా పద్ధతిగా పక్కన పెట్టి ఉండటాన్ని గమనించిన పోలీసులు భర్తను విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు.

మరింత Crime News: సినిమాని మించిన ప్లాన్.. భార్య హత్యకు సుపారీ ఇచ్చిన భర్త.. కేసు ఛేదించిన కూరగాయల సంచి!
crime news

Crime News: పింఛను డబ్బు కోసం కన్నతండ్రిని ముక్కలుగా నరికిన కేసు.. కొడుకు, కూతురికి ఉరిశిక్ష..!

Crime News: మౌలాలి రైల్వే కాలనీలో 2019లో జరిగిన రిటైర్డ్ ఉద్యోగి మారుతి సుతార్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రూ. 30 వేల పింఛను కోసం తండ్రిని ఉమ్మెత్త పొడి ఇచ్చి, కత్తులతో నరికి బకెట్లలో దాచిన కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లకు ఉరిశిక్ష విధించింది. హత్యకు సహకరించిన భార్య గంగాబాయికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి వి.బాలభాస్కర్‌రావు తీర్పునిచ్చారు.

మరింత Crime News: పింఛను డబ్బు కోసం కన్నతండ్రిని ముక్కలుగా నరికిన కేసు.. కొడుకు, కూతురికి ఉరిశిక్ష..!
Missing Case

Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!

Missing Case: గత నెల 27న టూర్‌కు వెళ్తానని చెప్పి కాచిగూడలో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!
Khammam

Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికి

Khammam: ఏలూరు జిల్లా చక్కపల్లి నుండి 36 మంది భక్తులు/ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ బస్సు ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సత్తుపల్లి, పెనుబల్లి ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన 12 మందికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరింత Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికి
Delhi Professor:

Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!

Delhi Professor: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. బెంగాల్‌లోని ఆమె కోట్ల విలువైన వారసత్వ ఆస్తిని దక్కించుకోవడానికి, అక్కడ అద్దెకు ఉంటున్న దంపతులే ఈ హత్యకు ఒడిగట్టారు. ముసుగులు ధరించి, బిడ్డతో కలిసి ఢిల్లీలోని ఆమె ఫ్లాట్‌కు వచ్చి హత్య చేసిన దంపతులను పోలీసులు బెంగాల్‌లోని బర్ధమాన్‌లో అరెస్ట్ చేశారు.

మరింత Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!
Delhi Fire Accident:

Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!

Delhi Fire Accident: ఢిల్లీ మాల్వీయనగర్‌లోని లెమన్‌ గ్రీన్‌ రెస్టారెంట్‌లో బుధవారం ఉదయం 9 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భవనంలో మరో 40 మంది చిక్కుకున్నట్లు సమాచారం. 10 అగ్నిమాపక వాహనాలతో సహాయక చర్యలు కొనసాగుతుండగా, బేస్‌మెంట్ నుండి ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

మరింత Delhi Fire Accident: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం.. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ!
Crime News:

Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!

Crime News: అమెరికాలోని జార్జియాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కేరళ మూలాలున్న భారత సంతతి పైలట్ డేవ్ ఫిజి (25) పెళ్లయిన కొద్ది గంటలకే మరణించాడు. ప్రతికూల వాతావరణంలో పైలట్ హెలికాప్టర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ కూడా మరణించగా, కొత్త పెళ్లికూతురు జెస్ని తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది.

మరింత Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!
Tragedy

Tragedy: స్నేహితుల ప్రాణాలు కాపాడి.. అమెరికాలో తెలుగు విద్యార్థి ‘అనురూప్ రెడ్డి’ వీరమరణం!

Tragedy: అమెరికాలోని టోలెడో బెండ్ రిజర్వాయర్‌లో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడి నల్గొండకు చెందిన తెలుగు విద్యార్థి అనురూప్ రెడ్డి (22) మృతి చెందాడు. అందరినీ ఒడ్డుకు చేర్చిన తర్వాత అతని కాలు నీటిలోని చేపల వేట వైరుకు చుట్టుకుపోవడంతో బయటకు రాలేకపోయాడు. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ గ్రాడ్యుయేట్ అయిన అనురూప్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నారు.

మరింత Tragedy: స్నేహితుల ప్రాణాలు కాపాడి.. అమెరికాలో తెలుగు విద్యార్థి ‘అనురూప్ రెడ్డి’ వీరమరణం!
Khaja Moinuddin Murder

Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!

Khaja Moinuddin Murder: అడ్వొకేట్ మొయినుద్దీన్ హత్యాయత్నం కేసులో ఆలంఖాన్ మరియు అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో మొయినుద్దీన్‌ను చంపేందుకు వీరు రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు తేలింది. గత రెండేళ్లలో ఆయనను హతమార్చడానికి నిందితులు 10 సార్లు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

మరింత Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!