Local Body Elections

AP News: ఏపీ పరిషత్ ఎన్నికల్లో 70.72% పోలింగ్ నమోదు: విశాఖ టాప్.. అల్లూరి జిల్లా లాస్ట్.. జిల్లాల వారీగా పూర్తి వివరాలివే!

AP News: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా గురువారం నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ (పరిషత్) ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. స్థానిక సంస్థల సమరంలో గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా కొన్ని చిన్నపాటి ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 70.72 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా వెల్లడించింది.

టాప్‌లో విశాఖ.. డీలా పడ్డ ఏజెన్సీ..

రాష్ట్రంలో నమోదైన పోలింగ్ సరళిని పరిశీలిస్తే పట్టణ, మైదాన ప్రాంతాల్లో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలిరాగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత నిరుత్సాహం కనిపించింది.

విశాఖపట్నం జిల్లా రికార్డు: రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ జిల్లాలో ఏకంగా 82.51 శాతం పోలింగ్ నమోదై మొదటి స్థానంలో నిలిచింది.

చిత్తూరు, విజయనగరం జోరు: చిత్తూరు జిల్లా 76.30 శాతంతో రెండో స్థానంలో నిలవగా, విజయనగరం జిల్లా 76.21 శాతంతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. అనకాపల్లి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోనూ పోలింగ్ 75 శాతం దాటింది.

చివరి స్థానంలో అల్లూరి జిల్లా: ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం 62.01 శాతం మాత్రమే ఓటింగ్ నమోదై రాష్ట్రంలోనే అత్యల్ప స్థానంలో నిలిచింది. అనంతపురం (64.38%), పోలవరం (65.48%) జిల్లాలు కూడా జాబితాలో అట్టడుగున నిలిచాయి.

జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు..

రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాల వారీగా ఓటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • విశాఖపట్నం: 82.51%

  • చిత్తూరు: 76.30%

  • విజయనగరం: 76.21%

  • అనకాపల్లి: 75.58%

  • ఎన్టీఆర్ జిల్లా: 75.53%

  • ఏలూరు: 75.52%

  • నంద్యాల: 74.27%

  • శ్రీ సత్యసాయి: 73.71%

  • కృష్ణా: 73.21%

  • గుంటూరు: 73.12%

  • వైఎస్సార్ కడప: 71.78%

  • తూర్పు గోదావరి: 71.56%

  • పల్నాడు: 70.93%

  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: 70.62%

  • పశ్చిమ గోదావరి: 69.73%

  • అన్నమయ్య జిల్లా: 69.19%

  • కాకినాడ: 68.94%

  • తిరుపతి: 68.67%

  • ప్రకాశం: 68.53%

  • కర్నూలు: 68.29%

  • మార్కాపురం: 67.69%

  • బాపట్ల: 67.47%

  • పార్వతీపురం మన్యం: 67.13%

  • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ: 66.33%

  • శ్రీకాకుళం: 65.51%

  • పోలవరం: 65.48%

  • అనంతపురం: 64.38%

  • అల్లూరి సీతారామరాజు: 62.01%

ఈ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను పటిష్ఠ బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *