Bus Accident: హైదరాబాద్ నగరంలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం చోటుచేసుకున్నది. నగరం నడిబొడ్డున రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా సిగ్నల్స్ వద్ద ఆర్టీసీ బస్సు నిలిచి ఉన్నది. వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bus Accident: డీసీఎం వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చి బస్సును డీసీఎం ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణికులను స్థానికులు, వాహనదారులు, పోలీసులు.. చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులు తరలించారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. బస్సు వెనుక భాగం ధ్వంసమైంది. డీసీఎం డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
Bus Accident: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. కర్నూలు చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు దహనం ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఆ తర్వాత చేవెళ్ల వద్ద మీర్జాగూడ బస్సు ప్రమాదంలో కూడా మరో 19 మంది చనిపోయారు. నిన్ననే ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశా ఆర్టీసీ బస్సు దహనమైంది. తాజాగా నగరంలో బస్సు ప్రమాదం.. ఇలా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంపై ఆందోళన నెలకొన్నది.

