Weather Update

Weather Update: చలికాలంలోనూ వానలేంటి? తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా ఉంది!

Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలలో వాతావరణం మారింది. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పలకరిస్తున్నాయి. మరి శుక్రవారం ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్:
నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోనసీమ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉష్ణోగ్రతలు సుమారుగా 26°C నుండి 32°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో నైరుతి, ఆగ్నేయ దిశల నుండి గాలులు వీచవచ్చు.

రైతులకు, ప్రజలకు ముఖ్య సూచన:
వర్షాలు పడే ప్రాంతాల్లో ఉన్న రైతులు, కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం వచ్చేటప్పుడు పొలాల్లో పని చేస్తుంటే వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలి. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి, చెట్ల కింద ఎప్పుడూ నిలబడొద్దు. అందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ కోరుతోంది.

తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. నవంబర్ 7వ తేదీన రాష్ట్రంలో వాతావరణం సాధారణంగా పొడిగానే ఉండే అవకాశం ఉంది. అయితే, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షం పడొచ్చు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సుమారుగా 22°C నుంచి 30°C మధ్య ఉండే అవకాశం ఉంది.

Also Read: Chevella Bus Accidetnt: చేవెళ్ల ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌లో ఎందుకు ఆల‌స్యం జ‌రిగింది: సుప్రీంకోర్టు క‌మిటీ సీరియ‌స్‌

వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు:
కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చు. అలాగే, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షం పడినప్పుడు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *