Bus Accident: హైదరాబాద్-వరంగల్ హైవేపై నవంబర్ 7న మధ్యాహ్నం మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం చోటుచేసుకున్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుషాపూర్ వద్ద ఓ కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని దూసుకుపోయింది. పక్కనే ఉన్న రెయిలింగ్ కు ఢీకొనడంతో అది అడ్డుకొని బస్సు నిలిచిపోయింది. దీంతో ఓ పెను ప్రమాదం తప్పిపోయింది. లేకుంటే రెయిలింగ్ అడ్డుకోకుంటే రోడ్డు కిందికి బస్సు దూసుకుపోయి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించి ఉండేది.

