mukhesh kumar goud

16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!

మాజీ మంత్రి కేటిఆర్ పై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా.. మూసీపై ఉన్న పురానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా అని ప్రశ్నించారు. తాను తన మంత్రులతో వస్తానని.. నువ్వు మీ పార్టీ వాళ్లతో వస్తావా అంటూ సవాల్ విసిరారు.

చెరువులను కుంటలను ప్రొటెక్ట్ చేయడమే హైడ్రా ముఖ్య టాస్క్ అని అన్నారు. ఆరు నెలలుగా మీ నాయనా ఎక్కడ దాక్కున్నాడో తమకు  అనుమానాలున్నాయన్నారు.

పీసీసీ చీఫ్. హైడ్రా, మూసీ.. రాహుల్ గాంధీకి లింక్ ఏంటని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. చెరువులను కుంటలను ప్రొటెక్ట్ చేయడమే హైడ్రా ముఖ్య టాస్క్ అని అన్నారు.  బీఆర్ఎస్ నాయకులు మూసి నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ తో   పోల్చితే  హరీష్ రావుకు మానవత్వం ఉందన్నారు. కొండా సురేఖ సోషల్ మీడియా పోస్ట్ పై కనీసం కేటీఆర్ స్పదించలేదన్నారు మహేష్ కుమార్ గౌడ్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *