Health Tips: ప్రస్తుత ఆధునిక కాలంలో అందరూ ఎదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అయితే, వీటికి కొన్ని రకాల ఆకులు, దినుసులతో చెక్ పెట్టొచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. బరువు పెరగడం, కంటి చూపు సమస్యలతో ఎంతో మంది బాధపడుతుంటారు. దీనికి కరివేపాకు ఆకును జ్యూస్ గా తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరకుతుందని చెబుతున్నారు. వీటితోపాటు మరెన్నో ప్రయోజనాలు చేకూరుతాయట.
కరివేపాకులోని గుణాలు.. ఇది చేసే మేలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. దీనిని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సమస్యల నుండి జుట్టు సమస్యల వరకూ ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఈ కరివేపాకు దూరం చేస్తుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా, దీనిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల కచ్చితమైన ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు. రిజల్ట్ పక్కాగా ఉంటుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Tomato For Skin: టమోటాలతో ముఖాన్ని అందంగా మార్చుకోవడం ఎలా?
Health Tips: కరివేపాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి వరం లాంటింది. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి1, విటమిన్ ఎ వంటి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, మినరల్స్ కూడా ఉన్నాయి. ఇందులోని గుణాలు చాలా ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి.
బరువు పెరగడానికి ముఖ్య కారణాల్లో ఒకటి జీర్ణ సమస్యలు, మలబద్ధకం. కరివేపాకు జ్యూస్‌ని తీసుకోవడం వల్ల ఈ రెండూ దూరమవుతాయి. అంతేకాకుండా, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. ఈ కారణాల వల్ల బరువు తగ్గుతారు.
కంటి సమస్యలు దూరం చేయడంలో ఆకుకూరలు ముందుంటాయి. ఈ నేపథ్యంలోనే కరివేపాకుని ఎక్కువగా తీసుకుంటే దృష్టి సమస్యలు తగ్గుతాయి. కరివేపాకులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కళ్ళు మసకగా కనిపించడం, దృష్టి సమస్యలు, కళ్ళు పొడిబారడం, రేచీకటి వంటి సమస్యలు తగ్గుతాయి.
కరివేపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ లివర్ పనితీరుని మెరుగ్గా చేయడంలో కీ రోల్ పోషిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. లివర్ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. రెగ్యులర్‌గా తీసుకుంటే లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి.