Breaking: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంచేసింది. ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు.“నంబర్ గేమ్ ఉండొద్దనే ఉద్దేశ్యంతో మేము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా మద్దతు ప్రకటించాం” అని ఆయన తెలిపారు.బొత్స వ్యాఖ్యలతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అధికారికంగా ఎన్డీఏ వైపు నిలిచినట్లు స్పష్టమైంది.