Bombay High Court:పోక్సో కేసు విషయంలో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితులు వేసే ఎత్తుగడలను ఆ తీర్పు చిత్తు చేసేలా ఉన్నది. చేసిన తప్పునకు శిక్ష అనుభవించాల్సిందేనన్న సందేశం ఆ కోర్టు ఇచ్చినట్టయింది. దీంతో ఎంతో కాలంగా ఉన్న అసమగ్రతపై ఓ కొలిక్కి వచ్చినట్టయింది.
Bombay High Court:ముంబైలో ఓ 17 ఏళ్ల వయసున్న బాలికపై 29 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతడిని రిమాండ్కు తరలించారు. బెయిల్ పై వచ్చిన అతను కొంతకాలానికి బాధితురాలినే పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక మగబిడ్డ జన్మించింది.
Bombay High Court:ఈ సమయంలో ఆ ఇద్దరు ఒకటవడంతో కేసును వాపస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. బాధితురాలు కూడా కేసు వాపస్ తీసుకునేందుకు అంగీకరించింది. ఈ విషయమై ఇద్దరూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలోనే బాంబే హైకోర్టు సంచలన విషయాలను వెల్లడించింది. పెళ్లి చేసుకున్నా, సఖ్యతగా ఉన్నప్పటికీ కేసు రద్దు కాబోదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.