Blue Ghost

Blue Ghost: చంద్రునిపై సురక్షితంగా దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్ బ్లూ ఘోస్ట్‌

Blue Ghost: అంతరిక్ష పరిశోధనలో మరో కీలక ఘట్టం నమోదైంది. అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థ తమ బ్లూ ఘోస్ట్ లూనార్ ల్యాండర్‌ను చంద్రుడిపై విజయవంతంగా దింపి చరిత్ర సృష్టించింది. ఇది చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయిన తొలి ప్రైవేట్ ల్యాండర్ కావడం విశేషం.

గతంలో పలు ప్రైవేట్ సంస్థలు చంద్రుడిపై ల్యాండింగ్ ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరి దశలో అవి విఫలమయ్యాయి. కానీ, ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ అందులో విజయవంతమైంది. ఈ ల్యాండర్‌ను జనవరి 15న ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎలాన్ మస్క్‌ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు.

నాసా ఆధ్వర్యంలో కీలక ప్రయోగాలు
Blue Ghost: బ్లూ ఘోస్ట్ నాసాకు చెందిన 10 శాస్త్రీయ, సాంకేతిక పరికరాలను చంద్రుడిపైకి తీసుకెళ్లింది. దాదాపు 6.6 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పున్న ఈ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విస్తృత పరిశోధనలు చేస్తుంది. ముఖ్యంగా, చంద్రుడి ధూళిని సేకరించేందుకు వాక్యూమ్ వినియోగం. ఉపరితలం కింద ఉష్ణోగ్రతలు కొలవడానికి డ్రిల్లింగ్  వ్యోమగాముల స్పేస్‌సూట్‌లకు హానికరమైన ధూళిని తొలగించే పరికరం ప్రయోగం.

ఈ ప్రయోగం కోసం నాసా దాదాపు $101 మిలియన్ డాలర్లు (~₹883.45 కోట్లు) ఖర్చు చేసింది. మొత్తం 15 రోజులు ఈ మిషన్ కొనసాగనుంది.

Also Read: Volodymyr Zelenskyy: ఖనిజాల ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం.. యూరప్ టూర్ తర్వాత మారిన జెలెన్ స్కీ

ఇంతవరకు చంద్రయాన కార్యక్రమాలను ప్రధానంగా ప్రభుత్వ సంస్థలే నిర్వహించాయి. కానీ, ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ ల్యాండింగ్ విజయంతో ప్రైవేట్ రంగం కొత్త మలుపు తిప్పింది. గతంలో ఇంట్యూయిటివ్ మెషీన్స్ అనే ప్రైవేట్ సంస్థ ఒడిసస్ ల్యాండర్‌ను చంద్రుడిపై దిగినప్పటికీ, అది చివరి దశలో కూలిపోయింది.

తాజా విజయంతో ప్రైవేట్ రంగానికి అంతరిక్ష పరిశోధనల్లో కొత్త అవకాశాలు తెరచుకున్నాయి. భవిష్యత్తులో మానవులను చంద్రుడిపై స్థిర నివాసానికి పంపే లక్ష్యంలో ప్రైవేట్ సంస్థలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *