health tips

Health Tips: ఇంటి భోజనం అయినా సరే ఈ జాగ్రత్తలు పాటించండి

Health Tips: ఇంట్లో తయారుచేసే భోజనంలో ప్రేమ, అభిమానం దాగి ఉంటాయి. ఇవి ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయినప్పటికీ భోజనం వండేటపుడు అనుసరించే కొన్ని పద్దతులు, వంటలో ఉపయోగించే ఆహార దార్థాల మోతాదు వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముంది. కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యకరమైన భోజనం అందించేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం!

నూనె, నెయ్యి

* మనం కూరలు వండేటపుడు అవసరమైనదానికంటే కొంచెం ఎక్కువ నూనె ఉపయోగిస్తూ ఉంటాం. దీనివల్ల కూర రుచి పెరుగుతుంది అనుకుంటాం. అట్లు వేసేటపుడు, చపాతీలు కాల్చేటపుడు కూడా నెయ్యి లేదా వెన్న ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. రుచిగా ఉంటాయని తరచూ వేపుళ్లు, పకోడీలు తయారు చేస్తూ ఉంటాం. ఇలా నూనె పదార్థాలు తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం, రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయి అధికమవుతాయి. బరువు పెరగడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. వంటచేసేటపుడు అవసరమైనంత వరకు మాత్రమే నూనె, నెయ్యి ఉపయోగించడం మంచిది.

పంచదార

* పుట్టిన రోజులు, పండుగల సందర్భాల్లో తయారు చేసే గులాబ్‌ జామూన్‌, హల్వా, పాయసం, పొంగలి తదితర వంటకాల్లో పంచదారను అవసరమైనదానికంటే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలాంటి తీపి పదార్థాలు తినడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం మందగిస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదముంటుంది. పంచదారను వీలైనంత తక్కువగా వాడడం, బదులుగా బెల్లం ఉపయోగించడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి: Health Tips: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జ్యూస్ తాగాల్సిందే!

ఉప్పు

* రోజూ వండే వంటల్లో ఉప్పును కాస్త తగ్గించి వేయడం మంచిది. ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, రోటి పచ్చళ్లను భోజనంలో మితంగా వడ్డించాలి. కుటుంబ సభ్యులు పెరుగన్నంలో ఉప్పు కలుపుకోవడాన్ని సమర్థించకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరిగి రక్తపోటు తద్వారా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.

మైదా

* గోధుమ పిండిని పూర్తిగా శుద్ది చేస్తే తెల్లని మైదా వస్తుంది. ఇందులో ఏ పోషకాలు ఉండవు. రుచిగా ఉంటాయని మైదా పిండితో పునుగులు, పూరీలు, చపాతీలు చేస్తూ ఉంటారు. వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి. మైదాకి బదులు గోధుమ పిండిని ఉపయోగించడం చాలా మంచిది. మైదా, పంచదార, వెనీలా ద్రావణం చుక్కలు కలిపి ఇంట్లో తయారుచేసే కేక్‌ కన్నా కిరాణా కొట్లో అమ్మే గోధుమపిండి మఫ్లిన్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

పోషకాలు ఉండేలా..

ALSO READ  Health Tips: పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఎన్నో లాభాలు

* కూరగాయలను అతిగా ఉడికించడం, వేపడం వల్ల వాటిలోని పోషకాలు నశించిపోతాయి. ఆకు కూరలను కూడా చిన్నమంట మీద తగినంత మేరకు మాత్రమే మగ్గించాలి. వంట చేసేటపుడు ఆవిరి మీద ఉడికించడం, కాల్చడం వంటి పద్దతులను పాటిస్తే ఆహార పదార్థాల్లోని విటమిన్లు, మినరల్స్‌ నష్టపోకుండా ఉంటాయి. కూర వండేటపుడు ఎక్కువగా మసాలా పొడులు కలపడం మంచిది కాదు. దీనివల్ల కడుపులో మంట, అజీర్ణం తదితర సమస్యలు ఏర్పడతాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *