Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో విజయవంతంగా తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే 9 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో, ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
నామినేషన్స్ మరియు ఓటింగ్ గడువు
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్:
- భరణి శంకర్
- సాయి శ్రీనివాస్
- తనూజ పుట్టస్వామి
- కల్యాణ్ పడాల
- సుమన్ శెట్టి
- రాము రాథోడ్
- సంజన గల్రాని
ఈ వారం ఓటింగ్ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు మాత్రమే ప్రేక్షకులకు తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓటు వేసే అవకాశం ఉంది.
ఓటింగ్ సరళిలో షాకింగ్ ట్విస్ట్!
ప్రస్తుత ఆన్‌లైన్ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఎప్పుడూ టాప్‌లో ఉండే తనూజను వెనక్కి నెట్టి, టాస్కుల్లో సత్తా చాటుతోన్న కల్యాణ్ పడాల ఇప్పుడు మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇది కూడా చదవండి: The Girlfriend Review: కోతగా రష్మిక.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ఎలావుందీ అంటే..?
గత వారాల్లో టాప్‌లో ఉన్న తనూజ పుట్టస్వామి ఈ వారం అనూహ్యంగా రెండో ప్లేస్‌కు పడిపోయింది. సీనియర్ హీరోయిన్ సంజన గల్రాని మూడో స్థానంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భరణి శంకర్ (4వ స్థానం), హీరో సాయి శ్రీనివాస్ (5వ స్థానం)లలో సేఫ్‌గా ఉన్నారు.
డేంజర్ జోన్‌లో ఎవరు?
ఈ వారం ఓటింగ్ సరళిలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఇద్దరు కీలక కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో ఉండటం.
టాప్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందిన సుమన్ శెట్టి ఈ వారం ఓటింగ్‌లో అనూహ్యంగా వెనుకబడిపోయి ఆరో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఫోక్ సింగర్ రాము రాథోడ్ అత్యంత తక్కువ ఓట్లతో, ఏడో ప్లేస్‌లో (చివరి స్థానం) ఉన్నాడు.
అంచనా: ప్రస్తుతం సుమన్ శెట్టి మరియు రాము రాథోడ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే, సుమన్ శెట్టికి హౌస్‌మేట్స్‌తో పాటు బయటి నుంచి కూడా గట్టి మద్దతు లభిస్తున్నందున, అతను సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వారం రాము రాథోడ్‌కే ఎలిమినేషన్ గండం ఎక్కువగా ఉందని బిగ్ బాస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫైనల్ ఎలిమినేషన్ ఫలితం కోసం శని, ఆదివారాలు ప్రసారం కానున్న ఎపిసోడ్స్ వరకు వేచి చూడాలి.

