Bigg Boss 9: బిగ్ బాస్ సీసన్ లో ఈసారి మొత్తం ఆరుగురు కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వైల్డ్ కార్డ్‌గా దివ్య కూడా వచ్చి జోష్ పెంచింది. అగ్నిపరీక్షలో తమ టాకింగ్, టాస్క్ స్కిల్స్‌తో అదరగొట్టిన వీరు, హౌస్‌లో మాత్రం నెగటివ్ వైబ్స్‌తో నెట్టుకొస్తున్నారు.
ఇప్పటికే మర్యాద మనీష్, ప్రియ, హరిత హరీష్ హౌస్‌కు గుడ్‌బై చెప్పగా, ఇప్పుడు నలుగురు కామనర్స్ మాత్రమే మిగిలారు. రీతూతో కలిసి డిమాన్ పవన్ టాస్కుల్లో అదరగొడుతుండగా, సోల్జర్ కళ్యాణ్ మాత్రం తన గేమ్‌తోపాటు తనూజ గేమ్‌పైనా ఫోకస్ పెంచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
టాస్కుల్లో టెన్షన్ – గెలిచిన జంటలు ఎవరు?
నిన్నటి ఎపిసోడ్ పూర్తిగా టాస్కులతో నిండిపోయింది. బిగ్ బాస్ పది మందిని ఐదు జంటలుగా విడగొట్టి, ఒక్కొక్క దానికి ఛాలెంజ్‌లు ఇచ్చాడు. మొదటి రౌండ్లో బొమ్మలు గీసే టాస్క్ పెట్టగా, భరణి–దివ్య జంట అద్భుతంగా ఆడి విజేతలుగా నిలిచారు.
తర్వాతి రౌండ్లో ఫ్లోరా–సంజన సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. శ్రీజ–సుమన్ షెట్టి, రీతూ–డిమాన్ పవన్ కూడా తమ బెస్ట్ చూపించారు. కానీ కళ్యాణ్–తనూజ జంట మాత్రం ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయారు. ప్రతి రౌండ్లోనూ కళ్యాణ్ తప్పిదాలే కారణమని హౌస్మేట్స్ గమనించారు.
ఇది కూడా చదవండి: Malla Reddy: 3 కోట్లు ఇస్తామన్నారు.. కానీ చేయలేదు.. మల్లారెడ్డికి ఆ తెలుగు సినిమాలో విలన్ ఆఫర్!
ఆటలో ఓటమి తట్టుకోలేక హర్ట్ అయిన తనూజకు సారీ చెప్పేందుకు కళ్యాణ్ ట్రై చేశాడు. కానీ “నువ్వు ఫోకస్ చేయాల్సింది టాస్క్‌పైనే, నా ముఖం మీద కాదు” అంటూ తనూజ గట్టిగానే రియాక్ట్ కావడం హైలైట్ అయ్యింది.
హోల్డ్ ఇట్ లాంగ్ టాస్క్‌లో హై డ్రామా
నామినేషన్స్ నుంచి బయటపడటానికి బిగ్ బాస్ “హోల్డ్ ఇట్ లాంగ్” అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో జంటలు తమకు ఇచ్చిన ప్లాట్‌ఫామ్‌ను రెండు వైపులా హ్యాండిల్స్‌తో గాల్లో పట్టుకుని ఉంచాలి. ఎవరైతే ఎక్కువసేపు ప్లాట్‌ఫామ్ నేలకు తగలకుండా ఉంచుతారో వారే విజేతలు.
ఈ టాస్క్‌లో ముందుగా సుమన్–శ్రీజ ఔట్ అయ్యారు. తర్వాత భరణి–దివ్య, ఫ్లోరా–సంజన కూడా ఔట్ అయ్యారు. చివరగా కళ్యాణ్–తనూజ, రీతూ–డిమాన్ పవన్ జంటలు మాత్రమే మిగిలాయి. టాస్క్ మధ్యలో తనూజకు పెయిన్ వస్తున్నదని చెప్పడంతో కళ్యాణ్ పొజిషన్ మార్చమని సూచించాడు. కానీ ఆ మువ్తో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సంచి కిందపడటంతో వీరి జంట ఎలిమినేట్ అయ్యింది.
తనూజ హర్ట్ అవుతుండగా కళ్యాణ్ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ తనూజ సైలెంట్‌గా ఉండక, తన ఫీలింగ్స్ బహిర్గతం చేయడం హౌస్‌లో చర్చకు దారి తీసింది.
వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ – గేమ్‌లో కొత్త టర్న్!
ఇక మరో వైపు, ఈ వారం ఆదివారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్స్‌లో టెన్షన్ మొదలైంది.
ఇమ్యూనిటీ టాస్క్‌లో గెలిచి నామినేషన్స్ నుంచి బయటపడిన ఇమ్మాన్యుయేల్ సేఫ్ జోన్లో ఉండగా, కెప్టెన్ రాము కూడా నామినేషన్ల నుంచి మినహాయించబడ్డాడు. మిగతా హౌస్మేట్స్ అందరూ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు.
బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌ల్లో ఎవరు తమ స్థానం కాపాడుకుంటారో, ఎవరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడాల్సి ఉంది.