Bengaluru: వివాహేతర బంధాలు ఇటీవల మితిమీరిపోతున్నాయి.. కొన్నిచోట్ల భర్తకు, కుటుంబంలో ఇతరులకు తెలిసినా ఐ డోంట్ కేర్ అనే స్థాయికి చేరుకుంటున్నాయి. వారు ఎంతగా చెప్పినా పెడచెవినే పెడుతున్నారు.. ఇక్కడో విచిత్రం చోటుచేసుకున్నది. భర్త, ఇతర కుటుంబ సభ్యుల మాట విందామనుకున్నా.. ఆ వివాహేతర బంధమే ఆమెను దారుణంగా బలిగొన్నది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ అమానుష ఘటన ఇలా జరిగింది.
Bengaluru: కర్ణాటకలోని బెంగళూరు బాణశంకరి పరిధిలోని హేమ్మిగేపుర ప్రాంతంలో నివసించే హరిణి (33) అనే మహిళకు 2012లో దేసేగౌడ (41) అనే రైతుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పిల్లా పాపలతో ఆ కుటుంబం హాయిగా ఉంటున్నది. ఈ దశలోనే ఆ కుటుంబంలోకి ఓ రక్కసి తొంగి చూసింది. అది రక్కసి అని తెలిసీ ఆ ఇంటి ఇల్లాలైన హరిణి ఆహ్వానించింది.
అసలేం జరిగిందంటే..
Bengaluru: మూడేళ్ల క్రితం ఒక జాతరకు ఆ కుటుంబం వెళ్లింది. అదే జాతరలో యహాస్ (25) అనే యువకుడితో హరిణికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర బంధానికి దారి తీసింది. దీంతో తరచూ యహాస్‌ను హరిణి కలుస్తూ రాసాగింది. ఈ సమయంలో వారి వివాహేతర బందం గురించి భర్త, కుటుంబ సభ్యులకు తెలిసింది.
Bengaluru: ఇదే విషయంపై ఆ కుటుంబం ఒక నిర్ణయానికి వచ్చింది. సాఫీగా సాగుతున్న ఆ కుటుంబంలో కల్లోలం చెలరేగవద్దని భార్యాభర్తలైన హరిణి, దేసేగౌడకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ఇద్దరికీ నచ్చజెప్పారు. పిల్లల కోసం, తమ కుటుంబం కోసం ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. ఇక అప్పటి నుంచి యహాస్‌ను కలవబోనని ప్రామిస్ చేసింది హరిణి. ఆనాటి నుంచి యహాస్‌ను కలవడం మానేసింది.
Bengaluru: యహాస్ తరచూ హరిణిని కలవాలంటూ వత్తిడి తేసాగాడు. దీంతో అతనిని స్వయంగా కలిసి నచ్చజెప్దామనుకున్నది. అదే చివరి సారి అని చెప్పింది. తన కుటుంబం విధించిన కట్టుబాట్ల గురించి చెప్పింది. సరేనని నమ్మబలికాడు ఆ కామాంధుడు. ఇద్దరూ ఓ హోటల్‌లో కలుసుకున్నారు. కుటుంబ సభ్యుల వత్తిడి వల్ల ఇక తాను కలవబోనని చెప్పేసింది హరిణి.
Bengaluru: హరిణి మాటలు విన్న యహాస్ రగిలిపోయాడు. కుటుంబం గురించి చెప్పగానే కండ్లల్లో నిప్పులు పోసుకున్నాడు. అప్పటికే ప్లాన్ తో ఉన్న అతను తన వెంట కత్తిని తీసుకొచ్చాడు. ఒక్కసారిగా ఆమెపై పడి విచక్షణారహితంగా 13 సార్లు హరిణిని కత్తితో పొడిచాడు. దాంతో ఆమె తనువు చాలించింది. వివాహేతర బంధం ఆపడం ఇష్టంలేకే ఆమెను హత్య చేశానని యహాస్ పోలీసులతో ఒప్పుకున్నాడు. హాయిగా ఉన్న ఆ కాపురం వివాహేతర బంధంతో కకావికలమైంది.