Partho Ghosh: బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. హిందీ సినిమా దర్శకుడు పార్థో ఘోష్ గుండెపోటుతో మరణించారు. బెంగాలీ నటి రీతుపర్ణ సేన్‌గుప్తా దర్శకుడి మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయనకు ప్రస్తుతం 75 ఏళ్లు.90లలో మాధురి దీక్షిత్ నటించిన ‘100 డేస్’ మరియు మనీషా కొయిరాలా నటించిన ‘అగ్నిసాక్షి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తనదైన చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఆయన చివరి హిట్ చిత్రం 1997లో వచ్చిన ‘గులాం ఇ ముస్తఫా’. ఇందులో రవీనా టాండన్ , నానా పటేకర్ నటించారు. ఆయన సినిమాలతో పాటు, ఆయన అనేక హిందీ, బెంగాలీ టీవీ షోలకు కూడా దర్శకత్వం వహించారు. 2015 నాటికి 15 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన ‘అగ్నిసాక్షి’, ‘100 డేస్’ మూవీస్ కు సీక్వెల్స్ తీసే పనిలో పార్థో ఘోష్ పడ్డారు. ఈ రెండు సినిమాలను వచ్చే యేడాది విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ లోగా గుండెపోటుకు గురైన పార్థో ఘోష్ తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. పార్థో ఘోష్‌కి అతని భార్య గౌరీ ఉంది. ఆ దంపతులకు పిల్లలు లేరు.
ఇది కూడా చదవండి: HBD Nandamuri Balakrishna: పద్మభూషణ్ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!