Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతానని బెదిరించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి పేరు ఫాతిమా ఖాన్ (24) అని ముంబై పోలీసులు తెలిపారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఆమె మెసేజ్ చేసింది. యోగి 10 రోజుల్లో రాజీనామా చేయకపోతే బాబా సిద్ధిఖీ లా చంపేస్తామని ఆ మెసేజ్ లో బెదిరించింది.
ఇది కూడా చదవండి: Abdul Rahim Rather: జమ్మూకాశ్మీర్ స్పీకర్ గా అబ్దుల్ రహీమ్ రాథర్
ఆ మహిళ ఎందుకు ఇలా చేసింది? దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె బాగా చదువుకున్న ధనిక కుటుంబానికి చెందిన ఆ మహిళగా పోలీసులు చెబుతున్నారు. ఈమెను పోలీసులు ఎక్కడి నుంచి అరెస్టు చేశారు అనే విషయాన్ని వెల్లడించలేదు. దీనిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో మహిళ మానసికంగా ఆరోగ్యంగా లేదని తేలింది. అయితే ఇది సీఎం యోగికి సంబంధించిన కేసు కావడంతో ముంబై పోలీసులు అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు చేస్తున్నారు.