Abdul Rahim Rather: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ ఫీజు ఎంతో తెలుసా?
Abdul Rahim Rather: 10 ఏళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత, కొత్త ప్రభుత్వంలో సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే అబ్దుల్ రహీమ్ రాథర్ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏడోసారి ఎమ్మెల్యే అయ్యి, కేంద్ర పాలిత ప్రాంతంలోని మొదటి అసెంబ్లీలో అత్యంత పాత ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. సమావేశాల ప్రారంభంలో స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇక అబ్దుల్లా ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం బీజేపీ ఇవ్వలేదు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో సునీల్ శర్మను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారు. కాగా సత్ శర్మను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.