Bandi sanjay: తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడం సరికాదని, దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు: “బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం ద్వారా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ముస్లింలకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే, అది సర్వోన్నత న్యాయస్థానాల ఆమోదం పొందిన విధంగా ఉండాలి. కానీ బీసీ హక్కులను ఖాతరు చేసి మత ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం అసహ్యం. ఇది రాజ్యాంగ విరుద్ధం.”బీజేపీ ఈ అంశంపై రాజీ పడబోదని, అసెంబ్లీ లోపలగానీ, బయటగానీ ఉద్యమాన్ని ముమ్మరం చేయబోతుందని హెచ్చరించారు. ఆయన తెలిపారు:
“బీసీల హక్కులను కాపాడడమే లక్ష్యంగా మేము ఉద్యమిస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ కుట్రలు బహిర్గతం చేస్తాం. బీసీలను అన్యాయంగా పడేస్తే ఊరుకోం. ముస్లింలు బీసీల జాబితాలో ఉండకూడదు. ఇది మతపరమైన రిజర్వేషన్‌కు తలవొగ్గే చర్య.” బీసీ వర్గాల అభివృద్ధి పేరుతో ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న మతపరమైన రాజకీయం హేయమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.