Balakrishna World Record: బాలకృష్ణ ఇప్పుడు ప్రపంచ సంచలనం అని చెప్పాలి. వరుస హిట్లు.. కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు.. మాస్, క్లాస్ తేడాలేకుండా ప్రభంజనం సృష్టిస్తున్న మూవీస్. ఇప్పుడు బాలయ్య బాబు ప్రపంచవ్యాప్తంగా ట్రేండింగ్. సంక్రాతి బరిలో డాకు మహారాజ్ గా థియేటర్లను దద్దరిల్లేలా చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాతో ప్రపంచ రికార్డ్ కూడా సృష్టించేశారు.
Balakrishna World Record: వరుసగా నాలుగు సినిమాలు సూపర్ హిట్స్. మొత్తం భారతదేశంలోనే ఈ రేంజ్ హిట్స్ అందుకున్న ఏకైక సీనియర్ హీరో బాలకృష్ణ. చిరంజీవి, ముమ్ముట్టి, మోహన్ లాల్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఇలా టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఏ సినీ ఇండస్ట్రీలోనూ కూడా ఆరుపదుల వయసు దాటిన ఏ హీరో కూడా సాధించని ఫీట్ ఇది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టడంతోనే ప్రపంచ రికార్డు కొట్టేసిన బాలయ్య.. ఇప్పుడు డాకు తో సీనియర్ హీరోల్లో ప్రపంచ సీనియర్ హీరోల్లో మహారాజ్ గా నిలిచారు.
Balakrishna World Record: ఇక డాకు మహారాజ్ సినిమాతో రెండో హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టిన బాలకృష్ణ అఖండ 2 తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మహాకుంభమేళాలో షూట్ షెడ్యూల్ ప్రారంభించారు. మరోవైపు డాకు మహారాజ్ అమెరికాలో వరుసగా నాలుగో సినిమాకు ఒక్క మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన హీరోగా కూడా పెద్ద రికార్డ్ తెచ్చిపెట్టింది. ఇప్పటివరకూ ఏ హీరోకు కూడా అమెరికాలో వరుసగా వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్ రాలేదు.