Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. బాలయ్య తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తమిళ మాస్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ బాలయ్యకు కొత్త కథను వినిపించారని, దీనికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ ఇటీవల అజిత్ కుమార్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించారు.
Also Read: Peddi: లండన్‌లో ‘పెద్ది’ హవా.. స్పెషల్ బ్యాట్ వైరల్!
Balakrishna: ఆ చిత్రం ద్వారా అధిక్‌కు విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు బాలయ్యతో కొత్త ప్రాజెక్ట్ కోసం అధిక్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని టాక్. అయితే, ఈ వార్తలపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
#AdhikRavichandran #Balayya #GoodBadUgly pic.twitter.com/68bMxcRffN
— Bharat Boxoffice (@BharatBoxoffic_) May 13, 2025