Revanth Reddy: గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే… రేవంత్ రెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాను చేసిన పనులు రివర్స్ కావడంతో వాటి నుండి తప్పించుకోవడానికి, ఆ విమర్శలను జనాలు మర్చిపోయేలా చేయడానికి మరో కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తున్నట్టు అనిపిస్తోంది.ఆరు హామీల అమలులో జరిగిన వైఫల్యం… దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో హైడ్రా తో అక్రమ కట్టడాలను కూల్చివేయడం… దానినిపై విపక్షాలు, స్వపక్షాల నుండి వచ్చిన విమర్శలను తట్టుకోలేక సతమతమౌతూనే… యేడాది విజయోత్సవాలు… వాటి సందర్భంగా వచ్చిన నిరసనలు తట్టుకోవడానికి… ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్…పుష్ప-2 సినిమాకు రేవంత్ బెనిఫిట్ చేశాడనే విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి… ఇంత చేసినా… సక్సెస్ మీట్ లో తన పేరు చెప్పలేదనే కోపాన్ని దిగమించుకోలేక… అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించడాన్ని అందరూ తప్పు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఇండస్ట్రీ అంతా ఏకమౌతుందా… రేవంత్ పై తిరగబుడుతుందా!?
ఇది బూమరాంగ్ అయ్యింది.
Revanth Reddy: అలానే గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం కూడాసరైనది కాదనే విమర్శలు వచ్చాయి. దాంతో గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక శాఖ సారధిగా నియమించి చేతులు దులుపుకున్నాడు. నిదానంగా తన బలాన్ని పెంచుకోవాల్సింది పోయి… రోజులు గడిచే కొద్ది రేవంత్ బలహీన పడుతున్నాడనిపిస్తోంది. తప్పులను గుర్తించకుండా… గత ప్రభుత్వం చేసినట్టుగానూ తానే ఒంటెద్దుపోకడ పోతున్నాడు. మొత్తం మీద అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి బోల్తా కొట్టావులే బుల్ బుల్ పిట్ట… అనే పాట రేవంత్ ని ఉద్దేశించి పాడుకునే పరిస్థితి వచ్చేసింది…మరి ఈ విమర్శల జడివానను రేవంత్ ఎలా తట్టుకుంటాడో చూడాలి.

