Do you know it: తెలంగాణను సాధించామని చెప్పుకుంటున్న ఉద్యమ పార్టీ… పదేళ్లు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ… రాజకీయ దురంధర, తెలంగాణ జాతిపిత, దేశ్‌కి నేతా అంటూ కీర్తి, ఖ్యాతులను రచించుకున్న పార్టీ… హ్మ్.. పాత్రికేయులుగా మీకు మేము చెప్పాల్సి రావడం, చెప్పించుకునే పొజిషన్‌లో మీరు ఉండటం నిజంగా బాధాకరం. పత్రికా స్వేచ్ఛ జనాభిప్రాయాన్ని రూపొందించడంలో కీలకం. రాజకీయ పార్టీలు దానిని దుర్వినియోగం చేయకుండా నీతితో వ్యవహరించడం అవసరం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్‌ని కూల్చేయాలనుకోవడం మీ అమాయకత్వం. అయినా.. మీడియా నోరు మూయించాలనుకోవడం.. ప్రజల గొంతు నొక్కడమే కాదు.. రాజకీయ పార్టీలకు ఆత్మహత్యా సదృశమని దేశ్‌కి నేతాకి తెలీదా? లేక పుత్రరత్నానికి ఆయన నేర్పించలేదా?
పత్రికలు, చానళ్లు సమాజంలో వాస్తవికతకు అద్దం పడతాయి. అది వాటి సహజ లక్షణం. వాటిని నియంత్రించడం అంటే సత్యాన్ని దాచి పెట్టాలనుకోవడమే. నేడు మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన ఆటవిక హింసాత్మక దాడి అందులో భాగమే అనుకోవాల్సి వస్తోంది. అయినా మీ పార్టీకి సొంత చానల్, పేపర్ లేవా? అవి మీ భజనలో తరించడం లేదా? అయినప్పటికీ అవి జర్నలిజం మూల సూత్రాలను విడిచిపెట్టాయని ఎవరూ భావించడం లేదే. మీకు మాత్రం ఇతర చానళ్లు, పత్రికలు ఎందుకు అలా కనిపిస్తున్నాయి? మీ దృష్టి లోపమా? మానసిక దౌర్భాగ్యమా? లేక దొరల గడీ పాలనను పుణికిపుచ్చుకున్న అహంకారమా?
Also Read: AP BJP Chief: ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్
Do you know it: నేడు మహాన్యూస్ ఎదుర్కొన్న హింసాత్మక దాడి.. దేశ వ్యాప్తంగా పాత్రికేయ రంగాన్ని ఏక తాటిపై నిలిపింది. ఆ స్థాయిలో విధ్వంసానికి మీరు పాల్పడినా… ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా మీడియా ఏకతాటిపైకి రావడం, పాత్రికేయ రంగానికి మంచి రోజులు రానున్నాయన్న సంకేతం వెలువడటం జర్నలిస్టులు అందరికీ ఊరటన్నిస్తోంది. నేషనల్ మీడియా వేదికలపై దోషులుగా నిలబడ్డ గులాబీల గూండాగిరికి చెంపపెట్టు ఇది. ఫోన్ ట్యాపింగ్‌తో దేశం పరువు తీసిన దేశ్‌కీ నేతా… తన కిరాయి రౌడీలతో మహాన్యూస్ జర్నలిస్టులపై హత్యాయత్నం చేయించి నేషనల్ మీడియాలో పాపులర్ అయిన ఆయన పుత్రరత్నం ఫోన్ ట్యాపింగ్‌కీ నేతా… తెలుసుకోవాల్సిన, తమ విధానాలపై పునరాలోచించుకోవాల్సిన సమయం ఇది.