YCP Gruha Praveshalu

YCP Gruha Praveshalu: కూల్చివేతల నుండి గృహ ప్రవేశాలకు..!!

YCP Gruha Praveshalu: అది 2024 జూన్ 22. ఉదయాన్నే తాడేపల్లిలోని ఒక భవన నిర్మాణంలోకి బుల్ డోజర్లు ప్రవేశించాయి. నిర్మాణంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేశాయి. అనుమతి లేకుండా అక్రంగా ఇరిగేషన్ లాండ్‌లో నిర్మాణం చేపట్టారని సీఆర్‌డీఏ ఆ భవనాన్ని కూల్చి వేసింది. ఆ భవనం వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంగా చేపట్టిన నిర్మాణం. ఒక్క భవనం కూల్చివేయగానే అలెర్ట్ అయిన వైఎస్సార్సీపీ.. 26 జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలను కాపాడుకోగలిగింది. వాటి నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు కూడా సన్నాహాలు ప్రారంభించింది.

రాజకీయ పార్టీలకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇవ్వొచ్చని 2016లో ఓ ప్రభుత్వ ఉత్తర్వు ఉంది. ఆ ఉత్తర్వును అడ్డు పెట్టుకొని నాటి వైఎస్సార్సీపీ గుట్టు చప్పుడు కాకుండా 26 జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలను లీజుపై తీసుకుంది. నామ మాత్రంగా ఎకరాకు వెయ్యి రూపాయల లీజ్ నిర్ణయిస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం 2022 మే నెలలో 33 సంవత్సరాల లీజుకు ప్రభుత్వ భూములను వైఎస్సార్‌సీపీకి కేటాయించింది. 11 జిల్లాల్లో విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, పుట్టపర్తి, పాడేరు, నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడ, ఏలూరు, బాపట్లలో 2 ఎకరాల చొప్పున వైఎస్సార్సీపీకి లీజుపైన ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భూముల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలను సైతం వైసీపీ చేపట్టింది. అయితే విషయం పార్టీ ముఖ్య నేతలకు తప్ప ఎవరికీ తెలియదు.

తాడేపల్లిలో వైసీపీ చేపట్టిన కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేతతో వైఎస్సార్సీపీ అలెర్ట్ అయింది. అదే సమయంలో పురపాలక శాఖ అధికారులు కూడా అక్రమంగా కట్టిన కట్టడాలను ఎందుకు కూల్చి వేయకూడదో 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసుల పైన హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ… ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగానే భూ కేటాయింపు జరిగిందని, నిర్మాణాలకు కూడా అనుమతులు ఉన్నాయని వాదించింది. చట్టంలో రెగ్యులరైజేషన్‌కు కూడా అవకాశముందని తెలిపింది. కూల్చి వేయడం వల్ల వైఎస్సార్సీపీకి నష్టం తప్ప ఎవరికీ ఉపయోగం లేదనీ, కాబట్టి కూల్చివేత అన్నది లాస్ట్ ఆప్షన్ మాత్రమే అవ్వాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. తాజాగా వైసీపీ మళ్లీ పావులు కదిపింది. మచిలీపట్నం, ఏలూరులలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ తాజాగా వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం.

Also Read: Cm revanth: 15 రోజుల్లో కోదండరాంను చట్ట సభలో ఉంచుతా..

మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే… వైసీపీ ఆఫీసులకు ఇలా కారు చౌకగా లీజుకు ప్రభుత్వ స్థలాలను కేటాయించుకుని ప్యాలస్‌ల వంటి పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటే.. తొలుత కఠిన చర్యలు తీసుకోవాలని ఉపక్రమించిన కూటమి ప్రభుత్వం.. ఆ తర్వాత న్యాయస్థానాల్లో బలంగా వాదించలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ కేటాయింపులను రెగ్యులరైజ్ చేయడానికి పెనాల్టీ నిర్ణయించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో, కూల్చివేయాల్సిన భవనాల్లో గృహప్రవేశాలకు సిద్ధమవుతున్న వైఎస్సార్సీపీ, చట్టపరమైన పోరాటంలో ఆధిక్యం సాధిస్తోంది. ఇప్పుడు వైసీపీ ఏకంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం పావులు కదుపుతోంది. అంటే కూల్చి వేయాల్సిన భవంతుల్లోనే నేడు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటోంది అనమాట. మాది మంచి ప్రభుత్వం అనుకున్నాం కానీ… మరీ ఇలా వైసీపీకి కూడా మంచి చేసేంత మనసున్న ప్రభుత్వం అనుకోలేదంటూ కొందరు కూటమి నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

ALSO READ  Jammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *