Sathibabu Sun Stroke

Sathibabu Sun Stroke: ‘వెన్నుపోటు’ అని చెప్పి.. ప్యాలస్‌ దాటని పులి!

Sathibabu Sun Stroke: వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన “వెన్నుపోటు దినం” ఆ పార్టీలో సీనియర్‌ నేత, ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేత బొత్స సత్యనారాయణకు ప్రాణ సంకటంగా మారింది. విజయనగరంలో వెన్నుపోటు ర్యాలీలో పాల్గొన్న ఆయనకు ఎండపోటు తగిలింది. మండుటెండలో వాహనంపై నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్క సారిగా బొత్స అలా కళ్లార్పకుండా నిలబడిపోయారు. అందరూ చూస్తుండగానే కింద కుప్పకూలారు. హుటాహుటిన ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ వెంటనే బొత్స తేరుకుని ఇంటికి వెళ్లిపోయారు.

బొత్స సత్యనారాయణకు తీవ్రమైన హృద్రోగ సమస్యలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందట. అప్పటి నుంచి బయట తీవ్రమైన ఒత్తిడి ఉండే కార్యక్రమాలు, రాజకీయ వేదికలకు దూరంగా ఉంటున్నారు బొత్స. ఎక్కువగా ప్రెస్మీట్లకే పరిమితమవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిపోయిన సందర్భంగా వెన్నుపోటు దినాన్ని గట్టిగా జరపాలని పార్టీ కార్యాలయం ఆదేశించింది. ముఖ్య నేతలంతా పాల్గొంటేనే వారు పార్టీలో ఉన్నట్లుగా భావిస్తామని హెచ్చరికలు పంపారు. దాంతో బొత్స సత్యనారాయణ ర్యాలీలో పాల్గొనాల్సి వచ్చింది. అయితే నేతలకు ఆదేశించిన జగన్‌ మాత్రం “వెన్నుపోటు దినం”లో ఎక్కడున్నారో తెలీదు. వీకెండ్‌కు ఇంకా రెండ్రోజుల సమయం ఉన్నందున ఆయన బెంగళూరుకు వెళ్లి ఉండరని, తాడేపల్లి ప్యాలెస్‌లోనే సేద తీరుతుంటారని అంతా భావిస్తున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీకి రాకుండా మొహం చాటేస్తున్న జగన్‌కు.. అసెంబ్లీలో పార్టీ వాయిస్‌ వినిపించడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం బొత్స సత్యనారాయణ. ఎందుకంటే ఏపీ శాసనమండలిలో బొత్స ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సామాజికవర్గ పరంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలమైన నేత, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలను ప్రభావితం చేయగల మోస్ట్‌ సీనియర్‌ నేత, సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స… గత ఎన్నికల్లో వైసీపీ ఎఫెక్ట్‌తో సొంత అడ్డాలోనే ఓటమి పాలవ్వాల్సి వచ్చింది.

Also Read: MLA Raj Thakur: పెద్ద‌ప‌ల్లి ఎంపీ వంశీపై ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ కీల‌క వ్యాఖ్య‌లు

Sathibabu Sun Stroke: ఆ తర్వాత స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా బొత్సకు జగన్ అవకాశం కల్పించగా.. సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఓటమి తర్వాత వైసీపీ రాజకీయాలు, జగన్‌ పోకడలకు.. బొత్స ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారని కొద్ది రోజులుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో పార్టీ మారేటట్లు అయితే బొత్సకు జనసేన కీలక పోస్టు ఆఫర్‌ చేసిందని కూడా వార్తలు వినిపించాయి. ఇటీవల ఓ రెండు సందర్భాల్లో అసెంబ్లీ ప్రాంగణంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో బొత్స కలివిడిగా ఉన్న వీడియోలు ఆ వార్తలకు బలం చేకూర్చాయి. అయితే.. అధికారం పోగానే పార్టీ మారాడన్న అపవాదు, తాను ఓడినా తనక పదవులిచ్చిన జగన్‌ని కష్టకాలంలో వీడి వెళ్లడం.. తనబోటి సీనియర్‌ పొలిటీషియన్‌ స్థాయికి తగదేమోనన్న అనుమానంతో బొత్స వెనకడుగు వేస్తున్నారని కూడా విశ్లేషణలు వినబడుతున్నాయి. ప్రస్తుతం వెన్ను విరిగి అవసాన దశలో ఉన్న వైసీపీకి.. అంత లాయల్‌గా పనిచేస్తున్న పెద్ద మనిషిని.. ఆరోగ్యం బాగోలేదని తెలిసినా… అలా ఎండలోకి పంపి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్న విమర్శ వైసీపీ అధిష్టానం పట్ల ఉత్తరాంధ్ర రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతోంది.

ALSO READ  KTR Shade: జూనియర్‌ రావు నిజస్వరూపం ఇదీ!

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *