Pawan Ultimate Smile: వైసీపీ అధినేత జగన్‌పై బాంబులా పేలాయి డిప్యూటీ సీఎం పవన్ సెటైర్లు. చిరునవ్వు, సింపుల్ సెటైర్‌తో జగన్‌కి మాస్ కౌంటర్లు ఇచ్చారాయన. ఎప్పటిలాగే ఢిల్లీ మీడియాకు మంచి ఫీస్ట్ ఇచ్చారు. తనదైన శైలిలో హ్యూమర్ జోడించి జగన్‌కు కౌంటర్లు ఇచ్చారు. మమ్మల్ని అధికారంలోకి రానివ్వమనడానికి పవన్ ఎవరంటూ జగన్ అంటే… “ఆహా.. అలా అన్నారా?” అంటూ పవన్ సింపుల్ రెస్పాన్స్ ఇచ్చారు. ‘హోదా’ కోసం జగన్ ఫీట్లు, అసెంబ్లీకి రాకుండా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై విలేకరులు పవన్ స్పందన కోరగా… వాళ్లు సెపరేట్ రాజ్యాంగం ఏదైనా రాసుకున్నారేమో అంటూ ఛలోక్తి విసిరారు. అయితే అలాంటి సొంత రాజ్యాంగాలు భారత రాజ్యాంగం ముందు చెల్లవు కదా అంటూ వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన పవన్… ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పవన్ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఏకంగా 164 సీట్లతో రికార్డు విక్టరీ దక్కించుకోగా… అప్పటిదాకా 151 సీట్లతో బలంగా కనిపించిన వైసీపీ మాత్రం 11 సీట్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకే భయపడిపోతున్నారు. ఏదో తమ సభ్యత్వాలు రద్దు కాకుండా ఉండేలా చూసుకుంటున్నారు తప్పించి అసెంబ్లీ సమావేశాల వైపే వెళ్లడం లేదు. జగన్ అనుసరిస్తున్న ఈ తరహా వ్యవహారంపై అధికార కూటమి పార్టీలతో సహా, సొంత పార్టీలోనూ సెటైర్ల మీద సెటైర్లు పేలుతున్నాయి. అయినా జగన్ తన పంథా ఏమాత్రం మార్చుకోవడం లేదు సరికదా.. ప్యాలస్‌లో స్క్రిప్టెడ్ ప్రెస్మీట్లతో కూటమి ప్రభుత్వంపైన, ప్రభుత్వాధినేతలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబులపైన తిట్లు, శాపనార్థాలతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే జగన్ రాజకీయాలు వర్కౌట్ కావని, ఇవాళ ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ తన సింపుల్ స్మైల్‌తోనే తేల్చేశారంటున్నాయి కూటమి వర్గాలు.
Also Read: Modi: మణిపూర్‌లో మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
గతంలో పవన్ కళ్యాణ్ పేరెత్తేందుకు కూడా ఇష్టపడని జగన్… ఇప్పుడు పవన్ పాలిటిక్స్‌కు, పొలిటికల్ సెటైర్లకు బలవుతున్నారు. అలాగని జగన్‌ని ఆయన ఎక్కడా తక్కువ అంచనా వేస్తున్నారని అనుకోవడానికి వీలు లేదు. కూటమి మరో పది, పదిహేనేళ్లు అధికారంలో ఉండటానికి జగన్‌ని బలంగా ఎదుర్కోవాల్సిందేనని పార్టీ క్యాడర్, లీడర్లని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. పవన్ కూడా సమయం, సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీకి మాటలతోనే మేకులు దింపుతున్నారు. సందర్భం కాదనుకున్నప్పుడు సింపుల్‌గా జగన్ టాపిక్ దాటేస్తున్నారు. అంటే.. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలి, సందర్భాన్ని బట్టే విమర్శలుండాలి, పదవుల్లో ఉన్న వారు హుందాగా బాధ్యతలు నిర్వర్తించాలి.. అన్న సూత్రాన్ని పవన్ పక్కాగా పాటిస్తున్నారనమాట.