Pawan Tweet Viral: భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వేళ, దేశవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక ట్వీట్ జాతీయ స్థాయిలో సోషల్ మీడియాను ఉర్రూతలూగించింది. తమిళ తత్వవేత్త తిరువళ్లువార్ రచించిన ‘తిరుక్కురల్’లోని 763వ పద్యాన్ని బహుభాషల్లో షేర్ చేస్తూ, పవన్ పాక్ ఉగ్రవాద శక్తులపై మిసైల్‌లా దాడి చేశారు. ”ఎలుకలన్నీజేరి సముద్రము వలే ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది? శేషనాగు చేసే ఒక్క హుంకారం మాత్రం చేతనే అవన్నీ నశిస్తాయి” ఇవీ పవన్ ట్వీట్ చేసిన తిరుక్కురల్ పద్యంలోని పంక్తులు. ఈ పద్యం ద్వారా పాక్‌ను ఎలుకలతో, భారత సైనిక శక్తిని శేషనాగుతో పోల్చి, దేశభక్తి జ్వాలలను రగిలించారు పవన్ కళ్యాణ్.
ఈ ట్వీట్ కేవలం రీట్వీట్లు, లైక్స్‌తో ఆగలేదు. ఆర్థిక, రక్షణ, రాజకీయ రంగాల నుంచి భారీ స్పందనను రాబడుతోంది. ‘#OperationSindoor’ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో, భారత రక్షణ వ్యవస్థపై తన గర్వాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ట్వీట్‌తో పాటు జతచేసిన కళాత్మక చిత్రం దేశభక్తి జోష్‌ను రెట్టింపు చేస్తోంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సుదర్శన చక్రంలా, భారత రాడార్ వ్యవస్థను బహుశిరోదసి శేషనాగుగా చిత్రీకరించగా, పక్కనే పాక్ ఉగ్ర శక్తులు చిట్టెలుకల్లా నేలకూలిన దృశ్యం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలను రేకెత్తించింది.
‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత సైన్యం పాక్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన శౌర్యగాథ ఈ ట్వీట్‌కు నేపథ్యంగా నిలిచింది.
మే 7, 2025న ప్రారంభమైన ఆపరేషన్ సిందూర్‌లో, భారత వైమానిక దళం… పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది. 100 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను, 35-40 మంది పాక్ సైనికులను హతమార్చింది. జైష్-ఎ-మహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా వంటి సంస్థలకు చెందిన యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి కీలక ఉగ్రవాదులు ఈ దాడుల్లో మట్టుబెట్టబడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ ట్వీట్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికగా మారింది. “పాక్ ఉగ్రవాదులు ఎంత గర్జించినా, భారత సైన్యం ఒక్కసారి ఉరిమితే చాలు, శత్రువు నాశనమైపోతాడు!” అని ఈ పద్యం ద్వారా పవన్ స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌కు భారతీయ నెటిజన్ల నుంచి “జై శేషనాగ్”, “జై పవన్” అంటూ రిప్లైలు వెల్లువెత్తాయి. కొందరు పాక్ పౌరులు కూడా ఈ ట్వీట్‌పై స్పందిస్తూ, భారత్ శక్తిని అంగీకరిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలకు మాత్రమే పరిమితమని భావించిన పవన్, దేశ రక్షణ విషయంలో తన స్పష్టమైన ఆలోచనలతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యారు.
Also Read: Nvss Prabhakar: జూన్ 2న కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం
Pawan Tweet Viral: ‘ఆపరేషన్ సిందూర్’లో భారత వైమానిక దళాలు… పాక్ ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, కీలకమైన పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ వ్యవస్థల్ని బూడిద చేశాయి. ఈ దాడులు పాక్ సైన్యాన్ని కలవరపరిచాయి. ఫలితంగా వారు కాల్పుల విరమణ కోరుతూ డీజీఎంఓ స్థాయిలో చర్చలకు ముందుకొచ్చారు. పవన్ ట్వీట్ ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ప్రదర్శించిన అసమాన శక్తిని, S-400 వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ ట్వీట్ దేశభక్తి జ్వాలలను రగిలించడమే కాక, భారత సైన్యం యొక్క అజేయ శక్తిని ప్రపంచానికి చాటింది. “శేషనాగు హుంకారం ముందు శత్రువుల గర్జనలు వ్యర్థం!” అన్న పవన్ ట్వీట్… భారత యువతలో జాతీయోత్సాహాన్ని నింపుతోంది.