Nadendla Manohar

Nadendla Manohar: నాడు సీట్లు, నేడు పదవులు.. జనసేనకు అన్యాయం?

Nadendla Manohar: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిట్ట చివరి స్పీకర్‌గా అతి క్లిష్ట సమయంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో ఏ పదవుల్లో ఉన్నా.. సమస్యలను చిరునవ్వుతోనే పరిష్కరిస్తూ.. ఇప్పటికీ అదే పంథా కొనసాగిస్తున్న గ్రేట్‌ లీడర్. ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటికి పౌరసరఫరాల శాఖకు ఉన్న అప్పెంత? ఈ ప్రభుత్వం తీర్చిందెంత? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నతో మొదలైంది మహా క్లాంక్లేవ్‌లో నాదెంద్ల మనోహర్‌తో మహా వంశీ డిబేట్‌.

నాదెండ్ల – వైసీపీ అరాచక పాలనలో పౌర సరఫరా రూటు తప్పిందన్నారు మంత్రి నాదెండ్ల. తమ శాఖకు 2019 నాటికి 15 వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు ఉండేవని, ఆ తర్వాత వైసీపీ పాలన ముగిసే నాటికి దానిని 41 వేల 150 కోట్లకి పెంచారంటూ నాదెండ్ల వెల్లడించారు. పోనీ ఆ నిధులు రైతుల కోసమో, పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ కోసమో వాడారా, గిడ్డంగులు ఏమైనా కట్టారా అంటే… అదీ లేదన్నారు.
ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించి వైసీపీ విమర్శలకు మహా కాంక్లేవ్‌ వేదికగా చాలెంజ్ విసిరారు నాదెండ్ల మనోహర్‌.
నేను చాలెంజ్‌ చేస్తున్నాను. ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలో కూడా ఎన్నడూ లేని విధంగా కొనుగోలు చేశాం. ఖరీఫ్‌లో కొన్ని
సమస్యలున్నాయి. సిష్టంలో ర్యాండమైజేషన్‌.. రైతు ఏ మిల్లుకు అమ్మాలనేది వీళ్లే నిర్ణయించే వారు. …………….. మా ప్రభుత్వంలో 77 వేల మంది రైతులు వాట్సాప్‌ సేవలను ఉపయోగించుకుని ధాన్యం అమ్ముకున్నారు. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బలు జమచేశాం. నేను ఛాలెంజ్‌ చేస్తున్నాను. గత ఐదేళ్లలో ఎంత కొనుగోలు చేశారు, ఎంత డబ్బులు చెల్లించారు.. నేను ఛాలెంజ్‌ చేస్తున్నాను… (వంశీ సార్‌ వ్యాఖ్యలు).. చేసింది కూడా చెప్పుకోవాలి కదా…
ఇక మహా కాంక్లేవ్‌లో సీజ్‌ ద షిప్.. అంశాన్ని నాదెండ్ల ముందుకు తీసుకొచ్చారు మహా వంశీ. దానికి చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు మంత్రి నాదెండ్ల.
వ్యవస్థలో ఎవరూ ఊహించని విధంగా ఒక సిండికేట్‌ని, మాఫియాని ఏర్పాటు చేశారు వైసీపీ ప్రభుత్వంలో. పది, పన్నెండు రూపాయలకే ఇదే ఎండీయూ వ్యాన్‌ల ద్వారా కొనుగోలు చేసి ప్రపంచ స్థాయికి ఎదిగిపోయారు. కాకినాడకు వెళ్లినప్పుడు 60 వేల మెట్రిక్‌ టన్నులు.. వాటిలో 38 వేల 400 మెట్రిక్‌ టన్నులు పీడీఎస్‌ రైస్‌గా నిర్థారించారు. పవన్‌ కళ్యాణ్‌ బలంగా ఫైట్‌ చేయాలని స్టెల్లా అనే షిప్‌ని, బయంకరమైన సైక్లోన్‌లో, లెట్స్‌ గో ఫైట్‌ అని ప్రయత్నించాం. పీడీ యాక్ట్‌ కిందకు రైస్‌ స్మగ్లింగ్‌ని తీసుకొచ్చాం. 266 కేసులు బుక్‌ చేశాం. 73 వేల మెట్రిక్‌ టన్నులు సీజ్‌ చేశాం. (వంశీ: వాళ్లు ఐదేళ్లు సీజ్‌ చేసింది 60 వేల మెట్రికల్‌ టన్నులైతే.. మీరు సంవత్సరంలో సీజ్‌ చేసింది 73 వేల మెట్రిక్‌ టన్నులు
అదేవిధంగా.. వైసీపీ హయాంలో జరిగిన ఎండీయూ వాహనాల స్కామ్‌పై సంచలన విషయాలు ప్రజల ముందుంచారు మంత్రి నాదెండ్ల.
ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే.. మూడు షాపులకు ఒక వ్యాన్‌.. మూడు వేల మందికి సంబంధించిన సరకు ఒక వ్యాన్‌ చేతిలో ఉండేది. ప్రతి వీధిలో ఒక గంట వెహికల్‌ని నిలిపి, వెళ్లిపోయేవాడు. ( వంశీ: మేము మీ ఇంటికి తీసుకొచ్చేవాళ్లం అని వైసీపీ వాళ్లు అంటున్నారు. పబ్లిక్‌ ఏం కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 రోజులు సరఫరా చేయాలి. 15 రోజులు అందుబాటులో ఉంటారు. వినియోగదారుడు తాను ఖాళీగా ఉన్నప్పుడే వెళ్లొచ్చు. వాళ్లు చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అదే విధంగా 15 లక్షల 74 వేల మంది దివ్యాంగులకు మేం ఇంటి వద్దే డెలివరీ చేస్తున్నాం.
Nadendla Manohar: ఇలా గణాంకాలతో సహా… వైసీపీ దుష్ప్రరానికి చెక్‌ పెడుతూ.. డీటెయిల్డ్‌గా చెప్పుకొచ్చారు మంత్రి నాదెండ్ల. అట్నుంచి చర్చను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌వైపు మహా వంశీ తీసుకెళ్లగా… చాలా ఆసక్తికరమైన అంశాలను మహా కాంక్లేవ్‌ ముఖంగా పంచుకున్నారు నాదెండ్ల.
పవన్‌ కళ్యాణ్‌ గురించి ప్రజలకు చాలా విషయాలు తెలీదు. ఆయన సినిమాలకు కేటాయించిన సమయం 10 శాతం మాత్రమే. ఎక్కువ సమయం సమాజం సమస్యలపైన, రాష్ట్రం గురించి, దేశం గురించి, ఎప్పటి నుంచో అధ్యయనం చేశారు.
పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా ఆ తండాలకు వెళ్లి.. చెప్పులు కొనిపంపించిన డిప్యూటీ సీఎం. ఆయన ఆలోచనలో విభిన్నమైన ఎఫెక్షన్‌ ఉన్నాయ్‌ ఏంటది? – నాదెండ్ల సమాధానం – ఆదిలాబాద్‌లో ఓ బోర్‌ వేసి పెట్టండని అడిగింది. ఆ అంశాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు పవన్‌ కళ్యాణ్‌.
కూటమి సమన్వయం ఎలా కుదిరింది? – నాదెండ్ల సమాధానం – ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు పవన్‌ కళ్యాణ్. భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో కొత్త తరానికి అవకాశం కల్పిస్తాం. కూటమి ప్రభుత్వంలో కూడా ఎక్కడా లైన్‌ క్రాస్‌ చేయకుండా హెచ్చరిస్తున్నారు. మరో 10 ఏళ్లు కూటమిని ముందుకు తీసుకెళ్తాం.
Nadendla Manohar: జనసేన పార్టీ పరంగా చాలామంది పదవులు ఆశించారు. చాలా మంది కష్ట పడ్డారు. ఆశించిన స్థాయిలో పదవులు ఇవ్వలేకపోతున్నారన్న అసంతృప్తి ఉంది కదా? – నాదెండ్ల సమాధానం – రాబోయే రోజుల్లో ఎవరైతే క్షేత్ర స్థాయిలో కృషి చేశారో, మా వీర మహిళలు, జనసైనికులు వారందరికీ కూడా క్షేత్ర స్థాయిలో ప్రియార్టీ ఇస్తూ.. విడత వారీగా చేసుకుని వెళ్తాం. పదవి అనేది ముఖ్యం కాదు.. రాష్ట్రం కోసం పనిచేద్దాం అనేదే పవన్‌ కళ్యాణ్ ఆలోచన.
ఇక పార్టీ సంస్థాగత నిర్మాణంపై వంశీ అడిగిన ప్రశ్నకు.. పార్టీ నిర్మాణం అనేది ఒక రోజులోనో, ఒక ఏడాదిలోనో పూర్తయ్యేది కాదన్నారు మంత్రి నాదెండ్ల. కూటమిగా అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో ప్రభుత్వానికే పూర్తిగా ఏడాది పాటు సమయం కేటాయించాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించారనీ, ఏడాది పూర్తయింది కాబట్టి ఇకపై పార్టీ నిర్మాణం ఊపందుకుంటుందని స్పష్టం చేశారు. చివరగా తెనాలి అయినా నగర్ ఘటనపై మహా కాంక్లేవ్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి, తెనాలి ఎమ్మెల్యే కూడా అయిన నాదెండ్ల మనోహర్‌.
నేపథ్యం కూడా చెప్పాలి. ఎలక్షన్‌ 10 గంటలలోపు అయిపోతుందని అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే బహిరంగ వేదికపై చెప్పారు. తెనాలిలో గంజాయి 90 శాతం నిరోధించాం. మొదటి రోజు నుండీ వెంటపడుతున్నా నేను. పోలీస్‌ పైనే దాడి చేస్తున్నప్పుడు పోలీసులు యాక్షన్‌ తీసుకోకుండా ఎలా ఉంటారు. – వంశీ సార్‌ ప్రశ్న – మీ రాజకీయంలో ఎవరైనా జగన్‌లా చేశారా? మీరు చూశారా? నాదెండ్ల సమాధానం – రాజకీయాల్లో ఎవరూ అలా చేయరు. ఊహించలేం.
ALSO READ  Tulsi Leaves Benefits: తులసి ఆకులను నమిలి తింటే ఏమవుతుంది..?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *