MDU Units Big Scam : వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ డోర్ డెలివరీ కోసం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అంటూ ఎండీయూ వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్‌లో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, పేదలకు రేషన్ సరఫరా విఫలమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈ అవినీతిని బయటపెట్టిందన్నారు.
ఈ స్కామ్ వివరాల్లోకి వెళితే షాకింగ్‌గా ఉంటున్నాయి. ముందుగా ఈ ఎండీయూ వాహనాలను మార్కెట్ ధర కంటే అధిక ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు అవినీతి ద్వారా దారి మళ్లినట్టు అంచనా. అలా ప్రభుత్వ ధనం పేదల సంక్షేమానికి ఉపయోగపడే బదులు, అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా.. కొనుగోలు చేసిన వాహనాల నాణ్యత దారుణంగా ఉండటంతో… చాలా వాహనాలు కొన్నాళ్లకే మూలన పడ్డాయి. దీంతో రేషన్ డెలివరీ వ్యవస్థ కుప్పకూలి, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆహార భద్రత దెబ్బతింది. ఈ వాహనాలు రేషన్ సరుకులను ఇంటింటికీ చేర్చాల్సి ఉండగా, నాణ్యత, పర్యవేక్షణ లోపాల వల్ల ఆ లక్ష్యం నీరుగారిపోయింది. ఇది కేవలం స్కామ్ మాత్రమే కాదు, పేదల జీవనాధారంపై దెబ్బకొట్టిన దుర్మార్గం అని విమర్శకులు అంటున్నారు.
MDU Units Big Scam: ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాల కొనుగోలు ప్రక్రియలో అవినీతికి ఆధారాలు ఉన్నాయని, విచారణ జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే గత ప్రభుత్వం ఈ స్కామ్‌ని ఒక సంస్థాగత అవినీతిగా మార్చేసిందనీ… ఇందులో అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు అందరూ పాత్రధారులుగా ఉండే అవకాశం ఉందనీ.. ఇలా వ్యవస్థలన్నీ కలిసి కుమ్మక్కై ఈ స్కామ్‌ని నడిపించి ఉండొచ్చన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. అంతిమంగా ఈ డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఎవరు లబ్ధి పొందారన్నది విచారణలో తేలాల్సి ఉంది.
Also Read: Pawan Kalyan support: ఏళ్ల క్రితమే క్లియర్ కట్‌గా చెప్పిన పవన్!
MDU Units Big Scam: ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ స్కామ్‌ను బయటపెట్టడంతో పాటు, అక్రమాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. 2014 నుండి 2019 వరకు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టుకున్న అక్రమ రేషన్ బియ్యం కేవలం 76 వేల టన్నులు మాత్రమే కాగా… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకంగా 60 వేల టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుందంటే.. తేడా అర్థం చేసుకోవచ్చు. రేషన్ అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపిన కూటమి సర్కార్.. ఇప్పుడు ఈ ఎండీయూ వాహనాల కొనుగోలు స్కామ్‌ని లెక్క తేల్చనుంది. ఈ కుంభకోణం వెనుక నిజాలు బహిర్గతమైతే, వైసీపీ పాలనలో అవినీతి లోతులు మరింత స్పష్టమవుతాయంటున్నారు పరిశీలకులు.

