Kodali America Tour

Kodali America Tour: ‘మెరుగైన వైద్యం’ కోసం అమెరికాకు కొడాలి నాని!

Kodali America Tour: గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని. రాజకీయాల్లో బూతులు, బెదిరింపులతో ఎదురులేని నేతగా రాణించారు. చంద్రబాబు అరెస్ట్‌ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు.. జైల్లో ఏమైనా రంభ, ఊర్వశులు వచ్చి సేవలు చేస్తారా? అంటూ వ్యంగ్యంగా ఎగతాళి చేసిన కొడాలి నాని.. ఇటీవల గుండెలో “క్లాట్స్”తో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. యాంజియో పరీక్షల్లో మూడు రక్తనాళాల్లో బ్లాకులు కనిపించాయి. స్టంట్స్, బైపాస్ ఆపరేషన్స్ రోజూ వందలాదిగా జరిగే ఏఐజీ హాస్పిటల్‌ కాదని.. “మెరుగైన వైద్యం” కోసం అంటూ ముంబైకి ప్రత్యేక విమానంలో షిఫ్ట్ అయ్యారు. అక్కడ కొడాలికి బైపాస్ సర్జరీ విజయవంతమైందని సమాచారం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతోంది!

ఏపీలో కొడాలి నాని, ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేసిన వెంటనే ఈ హెల్త్ డ్రామా స్టార్ట్ కావడం గమనార్హం. “నేను కేసులకు భయపడను.. మీరు పెట్టే కేసులు నాకు ఈక ముక్కతో సమానం” అని గొంతు చించుకున్న కొడాలి నాని.. ఒకసారి జైల్లో అడుగుపెడితే.. ఆ తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో.. తన ఆప్త మిత్రుడు వల్లభనేని వంశీ ఫేస్‌ చేస్తున్న పరిస్థితిని చూసి బాగానే గ్రహించినట్లున్నారు. దీంతో… గుండె దడ, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో మొదలైన కొడాలి హార్డ్‌ బ్రేకింగ్‌ స్టోరీ… చివరికి బైపాస్ స్టేజ్‌కి చేరినట్లుంది. పొలిటికల్ అనలిస్ట్‌లు చెబుతున్నది ఏంటంటే… ఇది మెడికల్ థ్రిల్లర్ కంటే.. రాజకీయ స్కెచ్‌లో భాగమై ఉండొచ్చని. హైదరాబాద్‌లో స్టంట్స్ వేయించుకోకుండా, ముంబైకి వెళ్లి సర్జరీ చేయించుకున్న కొడాలి.. అక్కడి నుంచి అమెరికా చెక్కేసినా ఆశ్చర్యం లేదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Kodali America Tour: “మరింత మెరుగైన వైద్యం” అనే సాకుతోనో, కొన్నాళ్లు విదేశాల్లో రెస్ట్‌ తీసుకుని వస్తే బెటర్‌ అని వైద్యులు సూచించారనో, కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా అదే కోరుకుంటున్నారనో.. మరో స్టోరీ క్రియేట్‌ చేసి… యూఎస్‌కి చెక్కేసే ప్లాన్‌లో ఉన్నట్లు ఊహాగానాలొస్తున్నాయి. అదే కనుక జరిగితే వైసీపీ “అందగాళ్ల” కంటే కొడాలి నాని బ్రెయిన్ ఎక్కువ షార్ప్‌గా పనిచేసిందనే చెప్పుకోవాలి. ఎంచేతనంటే… జగన్‌ చేత “అందగాడు” అనిపించుకున్న వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్‌లు ఏపీలో జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే.. కొడాలి మాత్రం “హార్ట్‌బీట్” డ్రామాతో అమెరికా దాకా ప్లాన్ వేశారని అంటున్నారు.

Also Read: Supreme Court: పాతికవేల మంది టీచర్లకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. వారి నియామకాలు చెల్లవట!

ALSO READ  Court: 30 కోట్ల క్లబ్ లో కోర్ట్!

స్టంట్, బైపాస్ అంటూ చికిత్స అయితే విజయవంతంగా పూర్తి చేయించున్నట్లున్నారు కానీ.. అటు నుంచి అటే అమెరికా అయినా వెళ్లొచ్చు… లేదా ఆ మెడికల్‌ సర్టిఫికెట్లు, సర్జరీ వివరాలు కోర్టుకు చూపించి… బెయిల్ ప్లీజ్‌ అనొచ్చు అని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు పొలిటికల్‌ ఎనలిస్టులు. బూతులు మాట్లాడేటప్పుడు, కోట్లు మింగేప్పుడు క్లాట్స్ రాలేదు.. బూతులు & అవినీతి ఆగిన తరువాత, ఈ క్లాట్స్‌తో పాట్లు పడ్డారు కొడాలి నాని. మొత్తానికి ఈ స్ట్రాటజీ.. కోర్టులో “మెడికల్ బెయిల్” కోసమా, లేక అమెరికా ఎస్కేప్‌ కోసమా అనేది తేలాల్సి ఉంది.

Kodali America Tour: మొత్తంమీద.. కొడాలి నాని హెల్త్ స్టోరీ – హార్ట్‌బ్రేకింగ్ కాదు కానీ, హార్ట్‌లెస్‌గా కన్నింగ్‌నెస్‌తో కూడిన పొలిటికల్‌ మాస్టర్‌పీస్ డ్రామాగా ప్రజలు చెప్పుకుంటున్నారు. “గుండె ఆపరేషన్ కంటే.. కేసుల నుంచి ఎస్కేప్ ఆపరేషన్‌లోనే కొడాలి స్పీడ్ మామూలుగా లేదుగా అంటూ పరిశీలకులు నవ్వుకుంటున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *