Kilaru Rosaiah Janasena

Kilaru Rosaiah Janasena: వైసీపీలోకి రీఎంట్రీకి సిద్దమౌతున్న కిలారి రోశయ్య..!

Kilaru Rosaiah Janasena: కిలారి రోశయ్య 2019 నుంచి 2024 మధ్య పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే. ఆయన ఆ పార్టీలో సూపర్ యాక్టివ్. మరోవైపు, కరప్షన్‌లోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టాప్ ప్లేస్‌లో ఉన్నారు కిలారి. గడిచిన వైసీపీ హయాంలో ఆయన పొన్నూరు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేశారు. వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈయనకు సంబంధించిన మైనింగ్‌ గుంటల్లో పడే చిన్నారు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆయన అవినీతిపై ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సుదీర్ఘ పోరాటం చేశారు. అలాంటి అవినీతి చరిత్ర ఉన్న కిలారికి గుంటూరు పార్లమెంట్ టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్ఠానం. అయితే, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కిలారి రోశయ్య చేసిన అక్రమ మైనింగ్, వందల కోట్ల అవినీతిపై విచారణ ఉంటుందని అనుకున్నారు అందరూ. కానీ సీన్ కట్ చేస్తే, చేసిన అవినీతిపై కచ్చితంగా ఇబ్బంది పడతానని గ్రహించిన కిలారి జనసేన పంచన చేరారు. అయితే, 11 సీట్లు వచ్చిన వైసీపీ పని రాష్ట్రంలో అయిపోయిందని, అందుకే మిగిలిన నేతలతో పాటు కిలారి రోశయ్య సైతం జనసేనలో జాయిన్ అయ్యారని అనుకున్నారంతా. కానీ… రోశయ్య జనసేనలో చేరింది జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో కాదంట. కేవలం తాను గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో చేసిన అక్రమ మైనింగ్, సంపాదించిన వందల కోట్లు, జగన్‌కు పంపిన వాటాలపై విచారణ నుంచి తప్పుకోవడానికి మాత్రమే అంటూ జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Also Read: Visakhapatnam Water Emergency: విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. నిలిచిపోయిన వాటర్ సప్లై..

పేరుకు జనసేనలో ఉన్నా, నిత్యం వైసీపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నారట కిలారి రోశయ్య. మరోవైపు ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్నారు కిలారి రోశయ్య మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఆయన మధ్యవర్తిత్వంతోనే వైసీపీ పెద్ధలతో టచ్‌లో ఉన్నట్లు వినికిడి. ఒకవేళ 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరిగి పుంజుకుంటే వైసీపీ నుంచి, వైసీపీకి ఇదే పరిస్థితి ఉంటే జనసేన నుంచి బరిలో నిలవాలని గోడ మీద పిల్లిలాగా వెయిట్ చేస్తున్నారంటా రోశయ్య. రోశయ్య తీరును, ఆయన వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న జనసైనికులు ఇలాంటి అవకాశవాదులు పార్టీకి అవసరమా? అని పార్టీ హైకమాండ్ వద్ద మొర పెట్టుకుంటున్నారట. చూడాలి మరి. భవిష్యత్తులో కిలారి రోశయ్య రాజకీయం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *