Jogi Manchi Baludu: జోగి రమేశ్.. జగన్ అమ్ముల పొదిలో ఆయుధం వంటి నేత. జగన్ కోసం జోగి రమేష్ చేసిన ఘనకార్యాలకు కొదవే లేదు. చంద్రబాబు ఇంటిపైకే తన పటాలాన్నంతా వేసుకుని వెళ్లి దాడి చేశారు. జగన్ కనుసైగతోనే బహిరంగ సభల్లో ప్రత్యర్థి పార్టీల నాయకులపై బూతులతో విరుచుకుపడేవారు. ఎంతలా అంటే.. అది నోరా.. తాటి మట్టా అనుకునేంతలా. అందుకే అప్పట్లో జోగికి జగన్ తన కేబినెట్‌లో చోటు కల్పించారు. అలాంటి నేత సడెన్‌గా జగన్‌కు షాక్ ఇచ్చారు. అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీ కొంపముచిందని స్పష్టం చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా వైసీపీ అధికారంలోకి వస్తే… ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు జోగి రమేష్. అంతేకాదు… ఏపీ శాసనసభలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు చాలా చాలా తప్పని ముసలి కన్నీరు పెట్టుకుంటున్నారు జోగి. ఆరోజు అసెంబ్లీ నుండి ఇంటికి వెళ్లిన తనను ఈ విషయంపైనే తన భార్య నిలదీసిందని చెప్పుకొచ్చారు. “ఇంతవరకూ మీరు వైసీపీ నాయకులే అనుకున్నాం.. కానీ ఇవాళ భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలతో అంతకు మించి దిగజారిపోయారని” తన భార్య అసహ్యించుకుందని వెల్లడించారు జోగి రమేష్. ఈ వ్యాఖ్యలన్నీ ఓ చానల్‌కి ఇంటర్వూ ఇచ్చిన సందర్భంగా మాట్లాడారు మాజీ మంత్రి జోగి రమేష్.
Also Read: Mahaa Vamsi: సజ్జల ఓవరాక్షన్..మహావంశీ స్ట్రాంగ్ రియాక్షన్
Jogi Manchi Baludu: జోగి రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయనలో ఇంతలోనే ఎంత మార్పు అంటూ అందరు షాక్ అవుతున్నారు. తాము అధికారంలోకి వచ్చినా అమరావతినే ఏకైక రాజధానిగా ఉంటుందని జోగి రమేశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? పార్టీకి సంబంధం లేనివా? అని అనుమానిస్తున్నారు అనలిస్టులు. ఎందుకంటే జగన్ మొన్నే తానో అమరావతి ద్వేషినని బయటపెట్టుకున్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. అమరావతి ఆశల్ని చంపేసి.. ఓ 500 ఎకరాల్లో సరిపెడతానని చెప్పారు. అటువంటి జగన్ ఇలా మాట్లాడమని తన పార్టీ నేతలకు చెబుతారని ఎవ్వరూ అనుకోరు. మరి అమరావతికి మద్ధతుగా జోగి ఎందుకు అంతగా ఓపెన్ అయిపోయారు అన్న సందేహానికి రెండు సమాధానాలు కనిపిస్తన్నాయి.
అందులో కేసుల భయంతోనే జోగి రమేశ్‌లో ఈ మార్పు వచ్చిందన్న వాదన ఒకటి. జగన్‌కి, వైఎస్సార్‌సీపీకి త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నారన్న ఊహాగానం మరొకటి. అయితే మరొక వాదన కూడా తాజాగా బయటకొస్తోంది. జగన్ సొంత చానల్‌లో శుక్రవారం నాడు ఓ ఇద్దరు మూర్ఖ సికామణులు చర్చల పేరిట.. అమరావతి ప్రాంత మహిళలపై అనకూడని మాటలన్నారు. ఫలితంగా సమాజం చేత, ముఖ్యంగా మహిళా లోకం చేతిలో చావుదెబ్బ తిన్నట్లుగా ఛీకొట్టించుకుంటున్నారు. వారి నోటి విరోచనాల కారణంగా.. జగన్ సొంత చానల్‌పై, దాన్ని నడుపుతున్న భారతి రెడ్డిపై, వైసీపీ పార్టీపై దారుణమైన ఎఫెక్ట్ పడుతోంది. దీంతో డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగానే జోగి రమేశ్‌ని శనివారం రంగంలోకి దించి ఉండొచ్చన్న అనుమానం కూడా పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.


