Jagan vs Lokesh DSC: సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. లోకేష్ ఆ హామీని 15 నెలల్లో కంప్లీట్ చేశారు. చెప్పాలంటే నోటిఫికేషన్ నుంచి ఫైనల్ లిస్టు వరకూ.. 150 రోజుల్లో మెగా డీఎస్సీ టాస్క్‌ను ముగించారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మొత్తం 16 వేల 347 మంది నిరుద్యోగుల జీవితాలను సూపర్ హిట్ చేశారు. లోకేష్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ ఇది. ఎన్నికల్లో గెలవడానికి జగన్ మెగా డీఎస్పీ హామీ ఇచ్చారు. గెలిచాక ఐదేళ్లు కాలక్షేపం చేశారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు.. అసలు ఏపీలో ఇన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తమకు తెలీదే అంటూ వెటకారాలకు పోయారు వైసీపీ నేతలు. ఇళ్లు అలకగానే పండగ కాదు.. 16 వేల టీచర్ పోస్టులంటే.. సాధ్యమయ్యే పని కాదన్నది వారి ఫిల్తీ కాన్ఫిడెన్స్. కానీ లోకేష్ చేసి చూపించారు. ఇప్పుడు జగన్‌తో సహా వైసీపీ మాజీ విద్యాశాఖ మంత్రులు… ఇంట్రస్ట్ ఉంటే.. మెగా డీఎస్సీ నిర్వహించడం ఎలానో.. లోకేష్ వద్ద ట్రైనింగ్ తీసుకోవాలంటున్నారు టీచర్ జాబ్ సాధించిన నిరుద్యోగులు.
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ-2025తో 16,347 టీచర్ పోస్టుల భర్తీ పూర్తయింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ ప్రక్రియ ఆరు నెలల్లోనే సజావుగా ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసి, సెప్టెంబర్ 15 నాటికి మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. వచ్చే నెల నుంచి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరనున్నారు. జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన మెగా డీఎస్సీ అటకెక్కింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ కాలేదు. ఖాళీలు లేవని ఐదేళ్లు మభ్యపెట్టుకుంటూ వచ్చి, చివరకు 6 వేల పోస్టులతో ఎన్నికల ముందు ఉత్తుత్తి ప్రకటన చేసినా, అది కాగితాలకే పరిమితమైంది. కానీ లోకేష్… జగన్ ఇస్తానని మోసం చేసిన 6 వేల పోస్టులకు, మరో 10 వేల అదనపు పోస్టులు జోడించి.. మెగా డీఎస్సీని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు.
Also Read: Maoist Party: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. అభయ్ పేరిట ప్రకటన
వైసీపీ ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టుల్లో పదుల కొద్దీ పిటిషన్లు వేసింది. లోకేష్ నేతృత్వంలోని సమర్థ లీగల్ టీమ్ వైసీపీ ప్రయత్నాలను కోర్టుల్లో తిప్పికొట్టింది. సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా వైసీపీ విఫలమైంది. పరీక్షా విధానం, ఫలితాల ప్రకటనలో ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా లోకేష్ పకడ్బందీగా వ్యవహరించారు. ఈ విజయం ఉపాధ్యాయ అభ్యర్థులకు జీవితాలను మార్చే శుభవార్త కాగా, లోకేష్ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. గత ప్రభుత్వాల్లో డీఎస్సీ అంటే.. అదో ప్రహసనం. నోటిఫికేషన్, ఎక్జామ్, రిజల్ట్, కోర్టు కేసులు.. చివరికి అభ్యర్థులకు కాల్ లెటర్లు ఎప్పుడొస్తాయో తెలీక ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ నేడు లోకేష్ అంతా మార్చేశారు. గతంలో సుదీర్ఘంగా సాగిన డీఎస్సీలకు భిన్నంగా… ఈసారి వేగవంతంగా, పారదర్శకంగా సాగిన ప్రక్రియ అందరి ప్రశంసలు అందుకుంటోంది. 16,347 మంది నిరుద్యోగుల కలలు నిజమైన ఈ రోజు, ఏపీ విద్యాశాఖలో కొత్త అధ్యాయానికి నాంది.