Jagan Ki Nastam Sakshi

Jagan Ki Nastam Sakshi: ‘క్షమాపణ’ ఆయనకు నచ్చని ఒకే ఒక్క పదం.. ఎవడికి నష్టం?

Jagan Ki Nastam Sakshi: కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలన్నట్లు వైఎస్‌ జగన్‌ ఓటమికి కారణాలెన్నో లెక్కగట్టడం కష్టం. అయితే.. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఆ జగన్‌కు, 11 సీట్లతో ప్రతిపక్ష నేత హోదా కోల్పోయిన ఈ జగన్‌కు చాలా తేడాలున్నాయి. 2019లో అధికారంలోకి రాక ముందు వైఎస్సార్‌సీపీ అంటే జగన్ ఒక్కడే‌. జగన్‌ ఒక్కడే ప్రజల్లో నడిచి, పార్టీని నడిపించారు. 151 సీట్లతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక వైసీపీ అన్నా, వైసీపీ ప్రభుత్వం అన్నా.. జగన్‌ మాత్రమే కాదు. ఆ పార్టీలో అనేక మంది అధినేతలు తయారయ్యారు. సలహాదారుల రూపంలో తిష్ట వేసి అధినేత ఇమేజ్‌కే తూట్లు పొడిచారు. ఇక కోటరీ రూపంలో సకల శాఖామాత్యులు తయారై.. ఐదేళ్లలో వైసీపీని వెంటిలేటర్‌పైకి చేర్చారు. ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న వైసీపీ.. ఎంతో జాగ్రత్తగా వేయాల్సిన అడుగులు ఎందుకు తడబడుతున్నాయ్‌? జగన్‌ని స్క్రిప్టెడ్‌ ప్రెస్మీట్ల కోసం పెట్టుకున్న రోబోలా మార్చేసి.. మొత్తం తతంగం నడిపిస్తోంది ఎవరు? అన్న అనుమానాలు ఆ పార్టీ క్యాడర్‌లోనే వ్యక్తం అవుతున్నాయి.

జరిగింది మహా అపరాధం. మహిళల్ని కించపరిచి రాజకీయాలు చేయడం తెలుగు నేలపై అసాధ్యం. ఆ దుస్సాహసానికి జగన్ ఇప్పుడు ఒడిగడుతున్నాడు. తన సొంత చానల్‌లో చోటు చేసుకున్న దారుణ తప్పిదంపై నోరు మెదపడం లేదు జగన్‌ మోహన్‌రెడ్డి. సాక్షి యాజమాన్యంగా భారతి రెడ్డి స్పందించడం కనీస ధర్మం. కానీ ఆవిడా ఆ పని చేయడం లేదు. బయటి నుంచి వచ్చిన ఒక జర్నలిస్టు, సొంత చానల్‌లోని మరో జర్నలిస్టును బలిచేస్తే చాలని భావిస్తే.. అది మూర్ఖత్వమే అవుతుందంటున్నారు పరిశీలకులు. జగన్‌, భారతి రెడ్డిలు భేషరతుగా క్షమాపణ చెబితే తప్ప.. ఈ వివాదానికి ముగింపు ఉండదని వైసీపీకి సానుభూతిపరులైన, సాక్షికి అభిమానులైన శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా అవే డిమాండ్లు వినిపిస్తున్నా.. చెవిలో సీనం పోసుకున్న తీరుగా వ్యవహరిస్తుండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ వైసీపీని, సాక్షిని నడిపిస్తోంది జగన్, భారతి రెడ్డి దంపతులా.. మరెవరైనా ఉన్నారా? అన్న సందేహం కలుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సజ్జల ప్రెస్‌ ముందు ప్రత్యక్షమయ్యారు.

Also Read: Sakshi Conspiracy: పక్కా సమాచారంతోనే పవన్‌ ఆ ప్రకటన చేశారా?

Jagan Ki Nastam Sakshi: అనువుగాని వేళ… సజ్జల బయటకొచ్చి… అగ్నికి ఆజ్యం పోసి… వైసీపీని తగలెట్టేశారన్న మాట వినిపిస్తోంది. అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరించడాన్ని ఖండించకపోగా… నిసిగ్గుగా సమర్థించారు సజ్జల. అంతేనా.. వారిని తీవ్ర పదజాలంతో దూషించారు. రెండ్రోజులుగా నిరసనలు చేస్తున్న మహిళలను… పిశాచాలు , రాక్షసులు అంటూ సజ్జల నోరు పారేసుకున్నారు. ఆవేదనతో నిరసన చేస్తున్న మహిళలను సంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. నిరసనలు చేసిన తెగ.. అర్గనైజ్డ్‌గా ఉన్న సంకర తెగ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అనడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటివరకు సాక్షి ఛానెల్‌పై ఆగ్రహంగా ఉన్న అమరావతి మహిళలు.. సజ్జల వ్యాఖ్యలతో వైసీపీపై కూడా తిరుగుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది.

ALSO READ  Sakshi Conspiracy: పక్కా సమాచారంతోనే పవన్‌ ఆ ప్రకటన చేశారా?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *