Bachchala Malli OTT

Bachchala Malli OTT: మూడు ఓటీటీలో ‘బచ్చల మల్లి’!?

Bachchala Malli OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేశ్ చేసిన మరో సీరియస్ సబ్జెక్ట్ ‘బచ్చలమల్లి’. రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై డిజాస్టర్ అయింది. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సుబ్బు దర్శకత్వంలో రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. రావు రమేశ్, రోహిణి, అచ్యుత్ కుమార్, హరితేజ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా జనవరి 10వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమిటంటే ఈ సినిమా మూడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తుండటం. వాటిలో ఒకటి సన్ నెక్ట్స్ కాగా, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ మరో రెండు. ఇలా ఓ చిన్న సినిమా అదీ థియేట్రికల్ గా అట్టర్ ప్లాఫ్ అయిన సినిమా ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తుంటం అంటే నిజంగా ఓ అధ్భుతమే. మరి థియేటర్లలో రాని రెస్పాన్స్ ఓటీటీలో లభిస్తుందేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ravi Teja: రవితేజ బర్త్డ్ డే స్పెషల్..మాస్ మహరాజా జాతర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *