HCA

HCA: మరోసారి వార్తల్లో హెచ్‌సీఏ.. ఉప్ప‌ల్ స్టేడియంలో పెవిలియ‌న్ పేరు తొల‌గింపు..!

HCA: హైదరాబాద్ క్రికెట్‌ సంఘం (HCA) మరోసారి వివాదాల్లో మునిగింది. తాజాగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్న నార్త్ స్టాండ్ పేరు విషయంలో కొత్త చర్చలు మొదలయ్యాయి. భారత మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ పేరు తొలగించాలంటూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

అజారుద్దీన్ పేరు వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ఈ స్టాండ్ కు 2012లో వీవీఎస్ లక్ష్మణ్ పేరు పెట్టారు. కానీ, 2019లో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్, తన అధికారాన్ని వినియోగించుకుని స్టాండ్ పేరు తనదిగా మార్చుకున్నారు. దీనిపై లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన అంబుడ్స్‌మన్, “ఇది స్వప్రయోజనాలకు పాల్పడటమే” అంటూ తేల్చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తనే ఓటింగ్‌లో పాల్గొని తన పేరు పెట్టుకోవడమంటే అది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: BJP MP: ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ మూసేయాలి’’.. వక్ఫ్ చట్టంపై బీజేపీ ఎంపీ..

ఇకపై స్టాండ్‌పై, మ్యాచ్ టిక్కెట్లపై అజారుద్దీన్ పేరు కనిపించకూడదని హెచ్చరించారు. హెచ్‌సీఏ అధికారులను ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇప్పటికే మహిళా జట్టు వివాదం, ఐపీఎల్ 2025 టికెట్ల విక్రయాలపై నెలకొన్న విమర్శలతో హెచ్‌సీఏ పేరును నిత్యం వార్తల్లో చూస్తున్న అభిమానికి – ఇది మరో ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న స్టేడియం అయినా, స్టాండ్ పేర్ల విషయంలో కనీస నియమ నిబంధనలు పాటించకపోవడం పలువురు క్రికెట్ ప్రియులను ఆవేదనకు గురిచేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *