Auto Driver

Auto Driver: భార్య పుట్టింటికి వెళ్లిందని ఆ ఆటోడ్రైవర్ చేసిన పని తెలిస్తే నవ్వకుండా ఉండలేరు!

మనం ఎక్కువగా భార్య పుట్టింటికి వెళితే సంబరపడే భర్తల కథలు.. సినిమాల్లో కామెడీ సీన్స్ చాలా చూసి ఉంటాం. అవన్నీ చూసినపుడు నిజంగా ఇంత ఇదిగా ఎవరైనా రియాక్ట్ అవుతారా? అని అనుకోవడం సహజం. కొంతమంది అబ్బా.. అలా మనం రియాక్ట్ అవ్వలేకపోతున్నామే అని బాధపడడం కూడా కామన్. ఇదిగో అలాంటి సినిమా సీన్ ఒకటి బెంగళూరులో కనిపించింది. 

తన ఆటోలో ఎక్కిన ప్రయాణీకులకు బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తూ పోతున్నాడు ఒక ఆటో డ్రైవర్. ఏమిటి విశేషం ఏదైనా ప్రత్యేకత ఉందా? అని అడిగిన వారికి తన ఆటోలోనే పెట్టిన ఒక బోర్డు చూయిస్తున్నాడు. అందులో అదేదో మణిరత్నం సినిమాలో భార్యను పుట్టింటికి వెళ్ళడానికి బస్సు ఎక్కించి.. కమెడియన్ కనకరాజ్ నా పెళ్ళాం పుట్టింటికి వెల్లిందోచ్ అని అరిచినా టైపులో రెండు లైన్లు రాసి ఉన్నాయి. “మా ఆవిడ వాళ్ల అమ్మగారింటికి వెళ్ళింది.. నేను హ్యాపీ..” అని ఇంగ్లీష్ లోనూ.. కన్నడలోనూ ప్రింట్ తీసి పెట్టాడు. దానికింద బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టాడు. 

ఆరోజంతా తన ఆటోలో ప్రయాణించిన వారికి బిస్కెట్ ప్యాకెట్స్ పంచిపెట్టాడు ఆ ఆటో డ్రైవర్. 

ఈ పరిస్థితిని అసాధారణంగా భావించిన ఒక ప్రయాణీకుడు దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ పోస్ట్ చాలా వేగంగా వైరల్ అయింది. చాలామంది  దృష్టిని ఆకర్షించింది. బిస్కెట్ ప్యాక్-నోట్ – ఫోటోతో కూడిన ఈ పోస్ట్ చాలామంది షేర్ చేశారు. దానికింద నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. ఇంకొకరు.. “వావ్, అతను నిజంగా స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నాడు” అని కామెంట్ పెట్టారు.  చాలా మంది నెటిజన్లు నవ్వుల ఎమోజీలను పోస్ట్ చేశారు. అంతేకాదు కొందరు అతనికి తన భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చాకా ఎదురయ్యే బాధలను గురించి తలచుకుని టెన్షన్ పడ్డారు. ఒక నెటిజన్ ఆ పోస్ట్ చేసినవారిని ఉద్దేశించి “మీరు ఒకరి జీవితాన్ని నాశనం చేశావు. ఈ పేదవాడు ప్రస్తుతం సంతోషంగా ఉన్నాడు. నువ్వు చేసిన పనికి ఈ పోస్ట్ వైరల్ అయి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇది అతని భార్యకు తెలిస్తే.. ఇకపై ఆటను జీవితమంతా ఆటోలోనే నిద్రపోవాల్సి రావచ్చు”అంటూ  కామెంట్ చేశారు. 

మొత్తమ్మీద పెళ్ళాం ఊరెళితే అని సినిమా తీసినోళ్లకు కూడా ఈ ఐడియా రాలేదు. ఈ ఆటోడ్రైవర్ చేసిన పని మాత్రం నెటిజన్లను నవ్వుల్లో ముంచేస్తోంది. 

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

 

EPIC MEDIA (@_epic69) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *