Election Commission: దేశంలోని 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎలక్షన్ కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు జూన్ 8 వరకు గడువు ఉండగా, జూన్ 18 సాయంత్రమే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో నలుగురు ఎంపీల పదవీకాలం జూన్ 26తో ముగియనుండటంతో కూటమి ప్రభుత్వం ఎవరిని నిలబెడుతుందనే ఉత్కంఠ నెలకొంది.
మరింత Election Commission: దేశంలో 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీలో జూన్ 18న పోలింగ్!Author: MAHAA News Desk
Lokesh Kanagaraj: యాక్టింగ్ పై పిచ్చితో.. డైరెక్షన్ లో పట్టు కోల్పోతున్న లోకేష్
Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ లాంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్.. తన తాజా చిత్రం ‘కూలీ’ ఆశించిన విజయం సాధించకపోవడంతో నటన వైపు మొగ్గు చూపుతున్నారు. వరుసగా నటన ప్రాజెక్టులు ఒప్పుకుంటూ ‘కత్తాలన్ సీక్వెల్’ లో విలన్ పాత్రకు సిద్ధమవుతుండటంతో.. ఆయన దర్శకత్వంపై పట్టు కోల్పోతారేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ‘ఖైదీ 2’ ప్రాజెక్ట్ కూడా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
మరింత Lokesh Kanagaraj: యాక్టింగ్ పై పిచ్చితో.. డైరెక్షన్ లో పట్టు కోల్పోతున్న లోకేష్Supreme Court: న్యాయవ్యవస్థలో కీలక మైలురాయి.. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు..!
Supreme Court: రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురు వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, సీనియర్ అడ్వకేట్ వి. మోహన నేరుగా బార్ నుండి సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ అయి దేశ చరిత్రలోనే రెండో మహిళగా రికార్డు సృష్టించారు. మంగళవారం జరగబోయే ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు తన పూర్తి స్థాయి సంఖ్యా బలానికి మరింత చేరువ కానుంది.
మరింత Supreme Court: న్యాయవ్యవస్థలో కీలక మైలురాయి.. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు..!Vaibhav Sooryavanshi: లీగ్‌ను శాసించిన 15 ఏళ్ల వైభవ్.. నెక్స్ట్ టార్గెట్ వింటే బౌలర్లకు నిద్రపట్టదు!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 అవార్డుల వేడుకలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ MVP, ఆరెంజ్ క్యాప్ (776 పరుగులు) సహా 4 ప్రధాన అవార్డులను గెలుచుకున్నాడు. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల ద్వారా ఒత్తిడిని జయించడం నేర్చుకున్నానని చెప్పిన సూర్యవంశీ, రాబోయే రోజుల్లో తన ఫిట్‌నెస్‌ను మరింత మెరుగుపరుచుకుని సుదీర్ఘకాలం ఆడటమే తన లక్ష్యమని ప్రత్యర్థులకు హెచ్చరిక పంపాడు.
మరింత Vaibhav Sooryavanshi: లీగ్‌ను శాసించిన 15 ఏళ్ల వైభవ్.. నెక్స్ట్ టార్గెట్ వింటే బౌలర్లకు నిద్రపట్టదు!Commercial LPG Price Hike: చమురు సంస్థల షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు!
Commercial LPG Price Hike: జూన్ 1 నుంచి చమురు సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. ఢిల్లీలో రూ.42, కోల్‌కతాలో రూ.53.50 మేర ధరలు పెరిగాయి. అలాగే 5 కిలోల చిన్న సిలిండర్ ధర కూడా రూ.11 పెరిగింది. అయితే గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం వల్ల హోటళ్లు, క్యాటరింగ్ రంగాలపై అదనపు భారం పడనుంది.
మరింత Commercial LPG Price Hike: చమురు సంస్థల షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు!RCB 2026 IPL Champions: గుజరాత్‌ను మట్టికరిపించి వరుసగా రెండో ఏడాది కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్!
RCB 2026 IPL Champions: ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. వాషింగ్టన్ సుందర్ (50) రాణించడంతో 155 పరుగులు చేసింది. అనంతరం ఆర్‌సీబీ.. విరాట్ కోహ్లీ (75 నాటౌట్), వెంకటేష్ అయ్యర్ (32)ల అద్భుత బ్యాటింగ్‌తో 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది
మరింత RCB 2026 IPL Champions: గుజరాత్‌ను మట్టికరిపించి వరుసగా రెండో ఏడాది కప్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్!Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుత పురోగతి.. మీకు ఎలా ఉందో చూసుకోండి!Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!
Viral News: 9 ఏళ్ల ఐటీ ఉద్యోగంలోని ఒత్తిడి భరించలేక ఒక మహిళా టెక్కీ తన ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారింది. ప్రస్తుతం ఆటో నడుపుతూ నెలకు రూ.60 వేలు సంపాదిస్తూ ప్రశాంతంగా జీవిస్తోంది. ఈమె కథ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఐటీ ఉద్యోగులు తమ పని ఒత్తిడిని పంచుకుంటూ ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
మరింత Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?
Harish Rao: కొత్తగా తీసుకొచ్చిన ఆర్పిడిసిఎల్ (రైతు డిస్కాం) వల్ల రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రాదని, కేవలం సోలార్ పవర్ కేటాయించడం వల్ల అది 8-9 గంటలకే పరిమితం అవుతుందని హరీష్ రావు జీవో నంబర్ 8 ఆధారంగా స్పష్టం చేశారు. దీనివల్ల అటు సాగునీటి లిఫ్ట్ ప్రాజెక్టులు, ఇటు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దమ్ముంటే 24 గంటల ఉచిత విద్యుత్‌పై సీఎం రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఛాలెంజ్ స్వీకరించాలని, దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
మరింత Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్.. 24 గంటల ఉచిత విద్యుత్‌పై బాండ్ పేపర్ రాసిచ్చే దమ్ముందా?KTR: చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు.. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారు?
KTR: కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అప్పులతో లక్ష ఇళ్లు, కాళేశ్వరం, రైతుబంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పే ధైర్యం సీఎంకు ఉందా అని సవాల్ విసిరారు.
మరింత KTR: చెప్పింది చేయరు.. చేసేది చెప్పరు.. రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారు?