Lokesh Kanagaraj: ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలోనే అత్యంత ఆసక్తికరమైన, క్రేజీ ఫిల్మ్మేకర్లలో ఒకరిగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు.నగరం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వచ్చిన ‘ఖైదీ’, మాస్టర్, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన తర్వాత, ఆయన కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం తనకంటూ కొంతమంది అభిమానులను అలాగే మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్‌గా మారిపోయారు.
ఆయన వైవిధ్యమైన యాక్షన్ కథాంశాలు, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేలు అలాగే సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా విజయవంతమైన ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU)ని సృష్టించి సినిమా సర్కిల్స్‌లో అపారమైన గౌరవాన్ని, ప్రజాదరణను సంపాదించుకున్నారు. అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన ‘కూలీ’ సినిమా తర్వాత పరిస్థితులు కాస్త మారినట్లు కనిపిస్తున్నాయి.
‘కూలీ’ తెచ్చిన బ్రేక్.. నటనపై పెరిగిన ఆసక్తి!
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కూలీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా ఫలితం చాలా మంది అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే, ఈ సినిమా తర్వాత లోకేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఖైదీ 2’ పనులతో ముందుకు వెళ్తారని అందరూ భావించారు. కానీ, లోకేష్ మాత్రం ఊహించని విధంగా తన దృష్టిని నటన (Acting) వైపు మళ్లించారు. ఇందులో భాగంగానే ఆయన ‘DC’ లో ఒక కీలక పాత్ర పోషించారు.
అంతేకాకుండా, ఇటీవల విడుదలైన ‘కత్తాలన్’ చిత్రంలో ఆయన ఒక చిన్న పాత్రలో (Cameo) మెరిశారు. తాజా సమాచారం ప్రకారం.. ఆ చిత్ర సీక్వెల్లో ఒక పూర్తి స్థాయి విలన్ పాత్ర కోసం కూడా లోకేష్ కనకరాజ్ పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
అభిమానుల్లో మొదలైన సరికొత్త ఆందోళన
లోకేష్ కనకరాజ్ అద్భుతమైన ప్రతిభ గల దర్శకుడనడంలో ఎలాంటి సందేహం లేదు. సరికొత్త మేకింగ్ స్టైల్‌తో తమిళ సినిమాను ఆయన నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లారు. అయినప్పటికీ, ఒక ఫిల్మ్‌మేకర్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు.. ఇలా వరుసగా నటనకు సంబంధించిన ప్రాజెక్టులను ఒప్పుకోవడం ఆయన ప్రధాన బలాన్ని దెబ్బతీసే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు నటుడిగా బిజీ అవుతూ యాక్టింగ్ కమిట్మెంట్లు పెంచుకుంటూ పోతే.. క్రమంగా మెయిన్ ప్రొఫెషన్ అయిన దర్శకత్వంపై ఆయనకున్న పట్టు ఇంకా ఫోకస్ బలహీనపడుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
AA 23 తర్వాతే ‘ఖైదీ 2’
కూలీ తర్వాత వెంటనే యాక్టింగ్ లోకి దిగ్గిన కలిసమయం లో ఖైదీ-2 స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తారు అని అందరూ అనుకున్న.. వెంటనే అల్లు అర్జున్ తో లోకేష్ AA 23 ని అనౌన్స్ చేశాడు. దింతో అందరూ ఎదురు చూస్తున కార్తీ హీరోగా రావలసిన ‘ఖైదీ 2’ సినిమా భవిష్యత్తు ప్రస్తుతం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇరు వర్గాల (నటీనటులు, నిర్మాతలు) మధ్య చర్చలు అంత సజావుగా సాగడం లేదని, కొన్ని అంతర్గత కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. మరి ఈ స్టార్ డైరెక్టర్ తిరిగి మెగా ఫోన్ పట్టి తన సినిమాటిక్ యూనివర్స్‌తో ఎప్పుడు అలరిస్తారో చూడాలి.
