guntur

Guntur: కేసీ రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..

Guntur: చదువు చెప్పండ్రా అని పంపితే..ఈ పనికి మాలిన పనులు చేయిస్తారా ? ఆ పనులే అలవాటు లేని ఆ అబ్బాయిలు అలంటి పనులు ఎలా చేస్తారు అని నుకున్నారు . ఎలాగో అలాగా చూపిస్తే..పది రూపాయలు కలిసివస్తుంది లే అనుకున్నారా ? అంతే లే ..డబ్బులు మిగలాలి కదా ? అందుకే ఈ పనులు ఆ అబ్బాయిలతో చేయించారు. ఇంతకీ ఆ విద్యార్ధి ప్రాణికి కారణం ఎవరు ? చనిపోయాడు మరి ఎవరు సమాధానం చెబుతారు ? 

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం, జంగంగుంట్లపాలెంలోని కేసీ రెడ్డి ఫార్మసీ కాలేజిలో దారుణం వెలుగుచూసింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో వాగు ఊబిలో ఇరుక్కుపోయి విద్యార్థి మృతి చెందాడు. మోటార్ మరమ్మత్తు కోసం కాలేజి యాజమాన్యం విద్యార్దులను వాగులోకి దింపింది. 

ఇది కూడా చదవండి: Chandrababu: పోలవరాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..

Guntur: అయితే వాగు ఊబిలో ఇరుక్కుని మూల్పూరు రంజిత్ కుమార్ అనే విద్యార్థి మృతి చెందాడు.ఊబిలో ఇరుక్కుపోయిన విద్యార్థి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 

అయితే మృత దేహాన్ని కాలేజీ యాజమాన్యం బయటకు తీయకపోవడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కాలేజి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *